ఆయన మరో 8వేల సంవత్సరాలు ఇజ్రాయెల్‌ విడిచి వెళ్లవద్దు.. విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు

By Mahesh K  |  First Published Dec 26, 2021, 1:23 AM IST

ఇజ్రాయెల్ కోర్టు ఓ విడాకుల కేసులో ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. పిల్లలకు భవిష్యత్‌లో పెట్టాల్సిన ఖర్చుల కోసం ఆ వ్యక్తిని దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. 9999 డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన ఇజ్రాయెల్ దేశం విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని తెలిపింది. లేదా నెలకు ఇద్దరు పిల్లకు పెట్టే ఖర్చులు చెల్లించి వెళ్లాలని ఆదేశించింది. ఈ తీర్పుతో ఆ ఆస్ట్రేలియన్ ఖంగుతిన్నాడు.



న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌(Israel)లోని ఓ కోర్టు(Court) తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సగటు మనిషి వందేళ్లు బతకడం నేడు గొప్ప. అలాంటిది ఆ కోర్టు ఓ వ్యక్తిపై 8 వేలకుపైగా సంవత్సరాల నిషేధాజ్ఞలు విధించింది. ఔను.. ఓ ఆస్ట్రేలియా వ్యక్తిపై ఈ నిషేధం విధించింది. విడాకుల కేసు(Divorce Case) విచారిస్తూ సదరు వ్యక్తి ఇజ్రాయెల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం డిసెంబర్ 31, 9999 వరకు వర్తిస్తాయని ప్రకటించింది. దీంతో నిందితుడ నివ్వెరపోయాడు.

నోవామ్ హపర్ట్ ఆస్ట్రేలియా దేశస్తుడు. ఆయన ఇజ్రాయెల్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం కూడా కలిగింది. కానీ, ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలతో ఆమె ఆస్ట్రేలియా వదిలి స్వదేశం ఇజ్రాయెల్ వెళ్లిపోయింది. నోవామ్ కూడా తన పిల్లలకు దగ్గరగా జీవించాలనే కాంక్షతో 2012లో ఇజ్రాయెల్ వెళ్లాడు. ఇజ్రాయెల్‌లోనే ఆయనపై భార్య 2013లో విడాకుల కేసు పెట్టింది. ఈ కేసు విచారిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

Latest Videos

Also Read: ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ. 5వేల కోట్లు చెల్లించండి.. దుబాయ్ షేక్‌కు బ్రిటీష్ కోర్టు ఆర్డర్

ఆ మహిళ ఇద్దరు పిల్లలు 18 ఏళ్లు నిండే వరకు రోజుకు 5000 ఇజ్రాయెల్ షెకెల్స్ ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భవిష్యత్ రుణాన్ని పూర్తి చేసే వరకు దేశం విడిచి వెళ్లవద్దని తెలిపింది. అంటే, ఇప్పుడు నోవామ్ హపర్ట్ హాలీడేల కోసమైనా, పని కోసమైనా ఇజ్రాయెల్ దేశం విడిచే అవకాశమే లేదు. ఆ తీర్పు ప్రకారం, నోవామ్ హపర్ట్ 3.34 మిలియన్ డాలర్లకు మించి చెల్లిస్తే ఇజ్రాయెల్ దేశం వదిలి బయట అడుగు పెట్టవచ్చు. లేదా 9999 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇజ్రాయెల్ దేశం విడవరాదని ఆదేశించింది.

2013 నుంచి నేను ఇజ్రాయెల్‌లో బంధీగానే ఉన్నా.. అంటూ ఈ తీర్పుపై స్పందిస్తూ నోవామ్ హపర్ట్ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ మహిళను పెళ్లి చేసుకున్నందుకు విదేశీయులను ఈ దేశ న్యాయవ్యవస్థను దారుణంగా శిక్షిస్తున్నదని వాపోయారు. ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అనలిటికల్ కెమిస్ట్‌గా పని చేస్తున్న 44 ఏళ్ల నోవామ్ హపర్ట్ తన విషాద గాధను అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నట్టు వివరించారు. తద్వారా భవిష్యత్‌లో ఇతరులు ఈ ప్రాణాంతక సమస్యను ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి అవకాశం చిక్కుతుందని చెప్పారు.

Also Read: విడాకుల భరణంగా రూ.52వేల కోట్లు కావాలి.. ఓ భార్య ట్విస్ట్.. ఎక్కడంటే...

ఒక వ్యక్తి సంపాదన ఎంత అనే దానితో నిమిత్తం లేకుండా విడివడుతున్న మాజీ భార్యకు భరణం చెల్లించాలని ఈ దేశ కోర్టు ఆదేశిస్తాయని ఓ నిపుణుడు చెప్పారు. ఒక్కోసారి ఆ వ్యక్తి సంపాదించే దానికంటే ఎక్కువగా చెల్లించాలనే ఆదేశాలు వెలువడవచ్చునని అన్నారు. ఈ చట్టం ద్వారా చాలా మంది పురుషులు నష్టపోయారని మరొకరు పేర్కొన్నారు.

దుబాయి పాలకుడు(Dubai Ruler) షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌కు, ఆయన మాజీ భార్య(Ex Wife) హయా బింత్ అల్ హుస్సేన్‌కు మధ్య ఇటీవలే విడాకుల సెటిల్‌మెంట్ జరిగింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తన మాజీ భార్య, వారి పిల్లలకు సుమారు 550 పౌండ్లు(సుమారు 730 మిలియన్ డాలర్లు.. ఇది 5.5 వేల కోట్ల రూపాయలకు సమానం) చెల్లించాలని బ్రిటీష్ కోర్టు ఆదేశించింది. బ్రిటీష్ చరిత్రలో ఖరీదైన డైవర్స్(Divorce) సెటిల్‌మెంట్‌లలో ఇది నిలవనుంది.

click me!