మయన్మార్‌లో మరో దారుణం.. సుమారు 30 మంది ఊచకోత.. సగం కాలిన శవాలు

Published : Dec 25, 2021, 11:58 PM IST
మయన్మార్‌లో మరో దారుణం.. సుమారు 30 మంది ఊచకోత.. సగం కాలిన శవాలు

సారాంశం

మయన్మార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. అక్కడి మిలిటరీ ప్రభుత్వం మరో 30 మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. విచక్షణారహితంగా కాల్చివేసింది. ఇందులో చాలా మృతదేహాలు సగం కాలి ఉన్నట్టు మానవ హక్కుల సంఘం పేర్కొంది. ప్రభుత్వంపై తిరగుబాటు చేస్తున్న టెర్రరిస్టులనే తాము మట్టుబెట్టినట్టు ఆర్మీ ప్రభుత్వం తెలిపింది. కానీ, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నట్టు తెలుస్తున్నది.  

న్యూఢిల్లీ: మయన్మార్‌(Myanmar)లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహింగ్యాల ఊచకోత మొదలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మిలిటరీ(Military) తిరుగుబాటు(Coup)తో నేలకూల్చినప్పటి నుంచి అనేక ఆగడాలు చోటుచేసుకుంటున్నాయి. మానవ హక్కులు(Human Rights) మచ్చుకైనా కనపడట్లేవు. తాజాగా, మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మిలిటరీ ప్రభుత్వం 30 మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ విషయాన్ని స్థానిక పత్రిక మిలిటరీ అధికారుల కోణంలో కథనం ప్రచురించింది. అయితే, మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి. ఘటనా స్థలంలో కాలిపోయిన శవాలు కనిపించాయని చెప్పాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కరెన్నీ హ్యూమన్ రైట్స్ గ్రూప్ తెలిపింది. మయన్మార్‌లోని కాయా రాష్ట్రంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.

దేశంలో అంతర్గత వలసలు వెళ్లిన పౌరులను అధికారిక మిలిటరీ పొట్టనబెట్టుకున్నదని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. ఇందులో మహిళలు, చిన్నపిల్లలు, వయోధిుకులూ ఉన్నారని వివరించింది. ప్రూసో పట్టణంలోని మోసో గ్రామంలో వారిని చంపేసిందని పేర్కొంది. కాగా, మయన్మార్ అధికార మీడియా సంస్థ మాత్రం ఇందుకు భిన్నమైన కథనాన్ని వెలువరించింది. మయన్మార్ ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులు కొందరు ఆయుధాలతో గ్రామాల్లో తిరుగుతుండగా వారిని మట్టుబెట్టినట్టు పేర్కొంది. వారంతా ఏడు వాహనాల్లో ప్రయాణిస్తున్నారని, వారిని ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోతుండగా యాక్షన్‌లోకి దిగినట్టు తెలిపింది.

Also Read: మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను మానవ హక్కుల సంఘం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ట్రక్‌ల వెనుకాల సగం కాలిన శవాలు ఉన్నట్టు ఆ చిత్రాలు తెలిపాయి.

ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మిలిటరీ కూలదోసింది. తాము స్వంత ప్రభుత్వాన్ని ప్రకటించారు. వ్యతిరేకించినవారిని ఊచకోత కోస్తున్నది. ఈ మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. అందులో కరెన్ని నేషనాలిటీస్ డిఫెన్స్ ఫోర్స్ ఒకటి. ఈ గ్రూప్.. ప్రస్తుత మయన్మార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నది. ఈ గ్రూపు తాజా ఘటనపై స్పందిస్తూ.. హత్యకు గురైన వారిలో తమ గ్రూపు సభ్యులు ఎవరూ లేరని వివరించింది. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలూ ఉన్నారని, ఈ ఘటనపై తాము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్టున్నట్టు ఆ గ్రూప్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు.

Also Read: మయన్మార్‌: సైనిక ప్రభుత్వ సంచలన నిర్ణయం.. ప్రజల గొంతు నొక్కేలా ఆదేశాలు

గతంలో జరిగిన ఎన్నికలు సరిగా లేవని, అందులో గెలిచిన ఆంగ్ సాన్ సూకీ పార్టీ గెలిచిందని మిలటరీ పేర్కొంటున్నది. ఆంగ్ సాన్ సూకీ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు చేసింది. అందుకే తాము తిరుగుబాటు చేసినట్టూ పేర్కొంది. ఈ నేరారోపణలను మయన్మార్‌లోని ఓ కోర్టు నిర్ధారించింది. ఆంగ్ సాన్ సూకీని దోషిగా ప్రకటించింది. జైలుకు పంపింది. కాగా, మిలిటరీ తిరుగుబాటుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతున్నది. తమ నిరసనలను హింసాత్మకంగా తొక్కేస్తున్న మయన్మార్ మిలిటరీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చాలా మంది యువత తిరుగుబాటుదారులుగా మారుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే