Sunita Williams and Butch Willmore homecoming: నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams)తో పాటు Crew-9 మిషన్ సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు. అయితే ఇప్పుడు సునీతాతో పాటు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు. భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ల శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయడానికి టైమ్ పడుతుంది. దీనికోసం వాళ్లు ట్రైనింగ్ తీసుకోవాలి. 9 నెలల పాటు మైక్రోగ్రావిటీలో ఉన్నాక శరీరాన్ని మళ్లీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు చేయడం ఈజీ కాదు. అందుకే నాసా వాళ్ల కోసం ఒక స్పెషల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ రెడీ చేసింది.
మొదటి 24 గంటలు: స్ప్లాష్‌డౌన్ (Splashdown) అయ్యాక వెంటనే సునీతా విలియమ్స్, ఆమెతో ఉన్నవాళ్లను మెడికల్ చెకప్ కోసం నాసా రీసెర్చ్ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ల కండరాలు, ఎముకలు, రక్త ప్రసరణను చెక్ చేస్తారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు అంతరిక్షం లాంటి వాతావరణంలోనే ఉంటారు.
మొదటి కొన్ని రోజులు: మైక్రోగ్రావిటీ వల్ల శరీరంలో వచ్చిన మార్పుల్ని తెలుసుకోవడానికి డాక్టర్లు రెగ్యులర్‌గా వాళ్ల బ్లడ్ టెస్ట్, ఈసీజీ, న్యూరోలాజికల్ టెస్టులు చేస్తారు.
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు బలహీనంగా అవుతాయి. అందుకే మొదటి రోజుల్లో సునీతకి స్పెషల్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేయిస్తారు. దీనివల్ల ఆమె బ్యాలెన్స్, కండరాల బలం తిరిగి వస్తుంది. మొదటి వారాల్లో ఆమెను ఫాస్ట్‌గా నడవడం, పరిగెత్తడం లేదా బరువులు ఎత్తడం లాంటివి చేయకుండా చూస్తారు.
అంతరిక్షంలో నెలల తరబడి ఉండటం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు. భూమికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ మారొచ్చు. దీనివల్ల నీరసం, తల తిరగడం లేదా అలసటగా అనిపించొచ్చు. డాక్టర్లు వాళ్లకు కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్పెషల్ డైట్ ఇస్తారు. దీనివల్ల వాళ్ల ఎముకలు, కండరాలు త్వరగా బలపడతాయి.