
నమీబియా అధ్యక్షుడు హాగే గీంగోబ్ మృతి చెందారు. కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన 82 ఏళ్ల వయస్సులో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. విండ్ హోక్ లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గీంగోబ్ మృతి చెందినట్లు ప్రెసిడెన్సీ తెలిపింది.
పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?
2014లో ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డానని ఆయన ప్రజలకు వెల్లడించారు. ఆ మరుసటి ఏడాదే అతను అధ్యక్షుడయ్యాడు. అయితే హాగే గీంగోబ్ మరణానికి సంబంధించి వెలువడిన ‘ఎక్స్’ పోస్ట్ లో ఆయన మరణానికి సంబంధించిన కారణాన్ని వెల్లడించలేదు. కానీ గత నెల చివరిలో సాధారణ వైద్య పరీక్షల తరువాత క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్ కు వెళ్తానని ప్రెసిడెంట్ ప్రకటించారు.
ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ
కాగా.. దక్షిణ ఆఫ్రికా దేశమైన నమీబియాలో ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన మరణించడం విచారకరం. దీంతో తాత్కలిక అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతోంది.