మయన్మార్‌లో కాల్పుల బీభ‌త్సం..  13 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Published : Sep 20, 2022, 06:25 AM IST
మయన్మార్‌లో కాల్పుల బీభ‌త్సం..  13 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

సారాంశం

మయన్మార్‌లోని బౌద్ధ విహారంలోని పాఠశాలపై సైన్యం హెలికాప్టర్ల తో  కాల్పుల‌కు పాల్ప‌డింది.  ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. మరో 17 మంది చిన్నారులు గాయపడ్డారు.

మయన్మార్‌లోని  ఓ  పాఠ‌శాల‌లో కాల్పుల బీభ‌త్సం సృష్టించ‌బ‌డింది. బౌద్ధ విహారంలోని ఓ పాఠశాల సైనిక హెలికాప్టర్లు దాడి చేశాయి. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 13 మంది చనిపోయారు. దీంతో పాటు ప‌దుల సంఖ్య‌లో  పలువురు గాయపడినట్లు సమాచారం. సైనిక దళాలపై దాడి చేసేందుకు తిరుగుబాటుదారులు పాఠశాలను ఉపయోగించుకోవడం వల్లే పాఠశాలపై దాడి జరిగిందని మిలటరీ పేర్కొంది. తిరుగుబాటుదారులు ఆశ్రమంలో దాక్కున్నారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలేకి 110 కిలోమీటర్ల దూరంలోని తబయిన్‌లోని లెట్ యాచ్ట్ కాన్ గ్రామంలో ఈ దాడి జరిగింది.

పాఠశాలపై  కాల్పులు 

తిరుగుబాటుదారులు గ్రామస్తులను మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నారని సైన్యం ఆరోపించింది. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. సోమవారం స్థానిక నివాసితుల స‌మ‌స్య‌ల‌ను ఉటంకిస్తూ.. మయన్మార్‌లోని సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోని ఒక గ్రామ బౌద్ధ ఆశ్రమంలో ఉన్న పాఠశాలపై సైన్యం హెలికాప్టర్లతో దాడి చేసింది. బుల్లెట్ గాయాల కారణంగా కొందరు చిన్నారులు చనిపోయారు. అనంతరం గ్రామంలోకి సైన్యం ప్రవేశించి కాల్పులు జరిపింది. దీంతో ఇతర చిన్నారులు చనిపోయారు.
 
ఈ త‌రుణంలో పాఠశాలపై దాడి చేయడం ప్రారంభించాయని, గ్రౌండ్ ఫ్లోర్‌లోని తరగతి గదుల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న క్ర‌మంలో కాల్పులు జ‌రిగాయ‌ని,   పాఠశాల నిర్వాహకుడు తెలిపారు. పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మరణించారని, సమీపంలోని గ్రామంలో 13 ఏళ్ల బాలుడు కూడా కాల్చి చంపబడ్డాడని తెలిపారు.

 దిగ‌జారిన మయన్మార్ ఆర్థిక‌ పరిస్థితి 

2021, ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైన్యం జరిపిన తిరుగుబాటు తర్వాత, అక్కడ పరిస్థితి నిరంతరం క్షీణిస్తునే ఉంది. మయన్మార్‌లో కూడా శ్రీలంక, పాకిస్థాన్ వంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 2021 తిరుగుబాటు తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దాని విదేశీ రుణం పెరిగింది. కోవిడ్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది.

దేశం విడుతున్న పౌరులు

వేలాది మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ క్ర‌మంలో అక్కడ ప్రజలు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. భారతదేశంలోని మిజోరాంలో ఇప్పటి వరకు వేలాది మంది ప్రవేశించారు. గత నెలలో మిజోరాం ప్ర‌భుత్వం సమాచారం ఇచ్చింది. గ‌త‌ ఆదివారం నుంచి మయన్మార్ నుంచి వందలాది మంది మిజోరాంలోకి ప్రవేశించారని జోఖౌథర్ విలేజ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ లాల్మువాన్‌పుయా వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?