మూడేళ్ల చిన్నారిపై తల్లి కర్కశత్వం.. "మగాడిలా ఉండడం నేర్చుకో" అంటూ ప్రియుడి దగ్గరికి...

By SumaBala Bukka  |  First Published Feb 29, 2024, 12:19 PM IST

మూడేళ్ల చిన్నారి ‘సారీ’ చెప్పలేకపోతున్నాడని ‘మగాడిలా ఉండడం’ నేర్చుకోమంటూ ప్రియుడి దగ్గరికి పంపిందో తల్లి. 


అమెరికా : మూడేళ్ల చిన్నారి అదృశ్యం విషయంలో బాలుడి తల్లి, ఆమె ప్రియుడిపై అమెరికా పోలీసులు అభియోగాలు మోపారు. చివరిసారిగా ఆ చిన్నారి వారం క్రితం తల్లి బాయ్ ఫ్రెండ్ తో కనిపించాడు. ఆ తరువాత కనిపించకుండా పోయాడు. మూడేళ్లే చిన్నారిని ‘మగాడిలా ఉండడం నేర్చుకో’ అంటూ తల్లి తన బాయ్ ఫ్రెండ్ కు అప్పజెప్పింది. షాకింగ్ గా అనిపిస్తున్నా ఇది నిజం. 

ఆ చిన్నారి చెప్పినట్లు వినడం లేదని, అల్లరి చేస్తున్నాడని.. శిక్షగా తన ప్రియుడి దగ్గరికి పంపింది ఆ తల్లి. బాలుడి తల్లి కత్రినా బౌర్‌, ఆమె ప్రియుడు జెస్సీ వాంగ్ లపై పోలీసులు అభియోగాలు మోపారు. ఎలిజా వ్యూ అనే ఆ చిన్నారి ఫిబ్రవరి 20న ట్వి రివర్స్ నగరంలో చివరిసారిగా కనిపించాడు.

Latest Videos

undefined

One Nation-One Election: 2029 నాటికి జమిలి ఎన్నికలు! రాజ్యాంగ సవరణకు లా కమిషన్ సిఫార్సులు!

పోలీసు అధికారుల ప్రకారం... జెస్సీ వాంగ్ (39), ఉదయం నిద్రలేచేసరికి బాలుడు కనిపించకుండా పోయాడు. ఆ చిన్నారి "చెడు ప్రవర్తనలను" సరిదిద్దడంలో ఎలిజా తల్లికి సహాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని కూడా అతను పోలీసులతో చెప్పాడు. బాలుడి తల్లి ఓ వారంపాటు తనతో ఉండమని పంపిందని చెప్పుకొచ్చారు. వాంగ్ రిలేషన్ షిప్ లో రూల్స్ ను బాగా పాటిస్తాడని.. అందుకే తన కొడుకును సక్రమమార్గంలో పెట్టమని అతనితో పంపానని జెస్సీ చెబుతోంది. 

ఆ చిన్నారికి ప్రార్థన చేయడం రావడం లేదని, క్షమాపణ చెప్పలేకపోతున్నాడని... తరచుగా మర్చిపోతున్నాడని అందుకే ఇవన్నీ నేర్పించడానికి బాయ్ ఫ్రెండ్ తో తల్లి పంపిందని తెలుస్తోంది. మొత్తంగా ‘మగాడిలా ఎలా ఉండాలో’ ట్రైనింగ్ ఇవ్వాలని తల్లి పంపించింది. 

తనను ప్రశ్నించిన డిటెక్టివ్‌తో వాంగ్ మాట్లాడుతూ, పసిపిల్లలకు ఎక్కువగా సీసాతోనే ఆహారం ఇచ్చేవారని, ఇంకా టాయిలెట్ కు వెళ్లే ట్రైనింగ్ కూడా ఇవ్వలేదని తెలిపాడు. చిన్నారి ఎలిజా ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 20 వరకు తన ఇంట్లో ఉన్నప్పుడు తనదగ్గరున్న బొమ్మతో కూడా ఆడుకోనివ్వలేదు. ఎందుకంటే అతను శిక్షాకాలంలో ఉన్నాడట. 

ఇక సీఎన్ఎస్ ప్రకారం, ఎలిజా కనిపించకుండా పోయే ముందు వాంగ్ మూడు 12-ఔన్సుల బీర్లు తాగాడు, కండరాలకు సంబంధించిన మాత్రలు వేసుకుని పడుకున్నాడు. తెల్లవారి ఉదయం, వాంగ్ ఆ చిన్నారిని బస్ స్టాప్‌కి తీసుకువెళ్లాడు. ఆహారంగా పాలు ఇవ్వకుండా తృణధాన్యాలిచ్చాడు. ఆ రోజు ఉదయం పసిబిడ్డ డైపర్ కూడా మార్చలేదట. తన బెడ్ మీద నిలబడి ప్రార్ణన చేయమని చెప్పానని వాంగ్ విచారణలో తెలిపాడు. సోమవారం, వాంగ్, చిన్నారి తల్లి బౌర్ పై పిల్లల నిర్లక్ష్యం, దుష్ప్రవర్తనలాంటి కేసులు పెట్టారు. 
 

click me!