నైలునదిలో బోటుప్రమాదం.. 19మంది కూలీలు మృతి..

By SumaBala BukkaFirst Published Feb 27, 2024, 9:04 AM IST
Highlights

కైరోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగి 19మంది కూలీలు మృతి చెందారు. 

కైరో : కైరో సమీపంలోని నైలు నదిలో కూలీలతో వెళ్తున్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది మృతి చెందినట్లు ఈజిప్టు కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. కైరోలోని ట్విన్ సిటీ అయిన గిజా దగ్గర ఆదివారం పడవ మునిగిపోయింది. ఐదుగురు గాయపడ్డారు.

మరణించిన వారి ఒక్కో కుటుంబానికి 200,000 పౌండ్లు ($6,462) పరిహారంగా, గాయపడిన ప్రతి కార్మికుడికి 20,000 పౌండ్లు చెల్లించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి గల కారణం అస్పష్టంగానే ఉంది. కొన్ని ఈజిప్టు మీడియా కథనాలు మాత్రం పడవలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నాయి.

దాదాపు 105 మిలియన్ల జనాభాతో అరబ్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఈజిప్టులో రవాణా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇలా జరుగుతాయని తరచూ ఆరోపణలు వస్తాయి.

కైరోకు వాయువ్యంగా 30 కిలోమీటర్ల (18 మైళ్లు) దూరంలో ఉన్న ఉత్తర గిజా గ్రామమైన నెక్లా సమీపంలో బోటు మునిగినప్పుడు చిన్న పడవలో 13 మంది కార్మికులు ఉన్నారని.. ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తాపత్రిక అల్-అహ్రామ్ తెలిపింది. 

click me!