బుర్కినా ఫాసో : చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రమూక .. 15 మంది మృతి

By Siva KodatiFirst Published Feb 26, 2024, 12:04 PM IST
Highlights

ఉత్తర బుర్కినా ఫాసోలో ‘‘సండే మాస్ ’’ టార్గెట్‌గా క్యాథలిక్ చర్చిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 15 మంది పౌరులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చురుగ్గా వున్న జిహాదీ గ్రూపులే ఈ దాడికి పాల్పడి వుంటాయని పోలీసులు భావిస్తున్నారు.

ఉత్తర బుర్కినా ఫాసోలో ‘‘సండే మాస్ ’’ టార్గెట్‌గా క్యాథలిక్ చర్చిపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 15 మంది పౌరులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎస్సాకనే గ్రామంలోని క్యాథలిక్ చర్చిలో ఫిబ్రవరి 25న ప్రార్ధనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారని.. డోరీ డియోసెస్ వికార్ జీన్ పియర్ సావడోగో ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 

బుర్కినా ఫాసోలో శాంతి, భద్రత కోసం పిలుపునిచ్చిన సావడోగో.. ఉగ్రదాడిని ఖండించారు. ఈ ప్రాంతంలో చురుగ్గా వున్న జిహాదీ గ్రూపులే ఈ దాడికి పాల్పడి వుంటాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలోనూ కొన్ని క్రైస్తవ చర్చిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మతాధికారులను అపహరించుకుపోయారు. బుర్కినా ఫాసో విస్తారమైన సాహెల్ ప్రాంతంలోని ఓ భాగం. 2011లో లిబియా అంతర్యుద్ధంలో పెరుగుతున్న హింసాత్మక తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధంలో చిక్కుపోయింది. అయితే 2012లో ఉత్తర మాలిని ఇస్లామిస్ట్ స్వాధీనం చేసుకుంది. 

జిహాదీ తిరుగుబాటు 2015 నుంచి బుర్కినా ఫాసో, నైజర్‌లలోకి వ్యాపించింది. 2022లో కెప్టెన్ ఇబ్రహీం త్రోరే అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే జిహాదిస్ట్ హింసను అణచివేయడంలో ప్రభుత్వ వైఫల్యాల పట్ల కొంత అసంతృప్తి నెలకొంది. నాటి హింసలో బుర్కినా ఫాసోలో దాదాపు 20 వేల మంది మరణించగా.. 2 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 

click me!