లాటరీలో రూ.290 కోట్లు.. తెలియక హ్యండ్ బ్యాగ్ లోనే.. ఆరువారాల తరువాత..

Published : Jul 29, 2021, 05:05 PM ISTUpdated : Jul 29, 2021, 05:10 PM IST
లాటరీలో రూ.290 కోట్లు.. తెలియక హ్యండ్ బ్యాగ్ లోనే.. ఆరువారాల తరువాత..

సారాంశం

జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన లాటరీతో రూ. 290 కోట్లు గెలుచుకుంది. ఈ డ్రాలో ఆమె ఒక్కతే విజేతగా నిలిచింది. ఇది తెలియని ఆమె ఆరు వారాల పాటు ఆ లాటరీ టికెట్ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది

జర్మనీకి చెందిన ఓ మహిళకు కలలో కూడా ఊహించని జాక్ పాట్ తగిలింది.  లాటరీలో 39 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 290 కోట్ల రూపాయలు గెలుచుకుంది. ఈ విషయం తెలియని ఆమె వారం పాటు ఆ టిక్కెట్ ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది. చివరికి లాటరీ మొత్తాన్ని తీసుకొని సంతోషంలో మునిగిపోయింది.

జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన లాటరీతో రూ. 290 కోట్లు గెలుచుకుంది. ఈ డ్రాలో ఆమె ఒక్కతే విజేతగా నిలిచింది. ఇది తెలియని ఆమె ఆరు వారాల పాటు ఆ లాటరీ టికెట్ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది...  అని లాటరీ టికెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

 అయితే ఆ మహిళ పేరును వెల్లడించలేదు. మొత్తం మీద ఆలస్యంగా అయినా ఆ మహిళ డబ్బు  తీసుకుంది. విషయం తెలియక ఆ టికెట్లు తన బ్యాగులో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు. గెలుచుకున్న మొత్తం తన కుటుంబం ఆరోగ్య కర జీవితాన్ని గడిపేందుకు సరిపోతుందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

పాకిస్థాన్‌లో గూగుల్ పే ఉంటుందా.? అక్క‌డి ప్ర‌జ‌లు డిజిట్ పేమెంట్స్ చేస్తారా లేదా.?
Flying Taxi: గంట‌లో హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లొచ్చు.. తొలి ఫ్ల‌యింగ్ టాక్సీ స్టేష‌న్ సిద్ధం