
మిస్ శ్రీలకం పోటీలు విమర్శల పాలైంది. న్యూయార్క్‌లోని స్టాటెన్ ఐలాండ్‌లో తొలిసారిగా జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీ ల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో.. ఒకరినొకరు కొట్టుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 300 మందికి పైగా అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో పురుషులు,మహిళలు ఒకరిపై ఒకరు దెబ్బల వర్షం కురిపించుకున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం(SCMP) , ఘర్షణకు కారణమేమిటనేది స్పష్టంగా తెలియలేదు. ఈ ఘర్షణలో కొంత ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
SCMP నివేదిక ప్రకారం, స్టేట్ ఐలాండ్‌లో అమెరికాకు వలస వచ్చిన పెద్ద సంఖ్యలో శ్రీలంక వాసులు నివసిస్తున్నందున, "కష్ట పరిస్థితుల్లో" ఉన్న ద్వీప దేశానికి సహాయం చేయాలనుకోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
పోటీ నిర్వాహకుల్లో ఒకరైన సుజనీ ఫెర్నాండో మాట్లాడుతూ, 14 మంది పోటీదారులలో ఎవరూ ఈ ఘర్షణలో పాల్గొనలేదని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఈ సంఘటన శ్రీలంకకు చెందిన సోషల్ మీడియా వినియోగదారులకు కోపం తెప్పించింది, ఇలాంటి ప్రవర్తన యునైటెడ్ స్టేట్స్‌లో తమ ప్రతిష్టను దిగజార్చుతుందని అన్నారు.
కాగా... శ్రీలంక వాసులు చిన్నా, పెద్ద, మహిళలు అని తేడాలు లేకుండా అందరూ.. ఒకరినొకరు కొట్టుకోవడం, ప్లాస్టిక్ కుర్చీలు పగలకొట్టడం, గోడుగులతో కొట్టుకున్నారని, ఇది చాలా అవమానకరం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.