బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్..!

Published : May 11, 2022, 09:03 AM IST
బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్..!

సారాంశం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ లో వివరాలు వెల్లడించారు. 

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం మాట్లాడుతూ, తనకు COVID-19 పాజిటివ్ గా తేలిందని.. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపాడు. అంతేకాదు తాను కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఐసోలేట్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. 

"టీకాలు వేయించడం, బూస్టర్ డోసులను అందించడం.. నిత్యం పరీక్షించుకునే సౌకర్యం కలిగి ఉండడం, మంచి వైద్యుల సంరక్షణ  ఉండటం నా అదృష్టం" అని గేట్స్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

సీటెల్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్ ఫౌండేషన్, దీని ఎండోమెంట్ సుమారు $65 బిలియన్లు. బిల్ గేట్స్ మహమ్మారి ఉపశమన చర్యలకు, ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్‌లు, మందులు అందేలా చూసిన వ్యక్తి.  అక్టోబరులో గేట్స్ ఫౌండేషన్ తక్కువ-ఆదాయ దేశాల కోసం డ్రగ్‌మేకర్ మెర్క్ యాంటీవైరల్ COVID-19 పిల్ జెనరిక్ వెర్షన్‌లకు యాక్సెస్‌ను పెంచడానికి $120 మిలియన్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, నిరుడు ఏప్రిల్ లో బిల్ గేట్స్ కరోనా టీకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సెంకడ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ సూచన చర్చనీయాంశంగా మారింది. 

ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలం అవుతున్న సమయంలో బిల్ గేట్స్  వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  కోవిడ్ 19 తో భారతదేశం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ప్రపంచం మొత్తం భారత్ కు మద్దతునందిస్తోంది.  ఈ సయమంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ విషయంలో టెక్నాలజీ, పేటెంట్లకు సంబంధించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్సలతో ఆయన తీవ్ర విమర్శలనెదుర్కొంటున్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ల సూత్రాలను పంచుకునేందుకు వీలుగా మేథో సంపత్తి చట్టాన్ని మార్చడం సాధ్యమా? అంటూ స్కై న్యూస్ ఇంటర్వ్యూలో గేట్స్ ను ప్రశ్నించగా.. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాక్సిన్ సూత్రాలను పంచుకోవడం సరికాదు’ అంటూ ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. 

ఆ సమాధానం మీద వివరణ కోరగా ‘ప్రపంచంలో టీకాలు తయారు చేసే కర్మాగారాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాక్సిన్ ఫార్ములా పంచుకోకూడదు. అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీకి భారత్ లోని వ్యాక్సిన్ల తయారీ కర్మాగారానికి చాలా తేడా ఉంది. మా నైపుణ్యం, డబ్బు విజయవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేస్తాయి’ అని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా టీకా ఫార్ములా ఎవరితోనైనా పంచుకోగలిగే పేటెంట్ లాంటిది కాదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే