Donald Trump Twitter Return: "నిషేధాన్ని తొలగిస్తా.. " ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఎలోన్ మస్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Published : May 11, 2022, 01:00 AM IST
 Donald Trump Twitter Return: "నిషేధాన్ని తొలగిస్తా.. " ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఎలోన్ మస్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

సారాంశం

Donald Trump Twitter Return: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తానని ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు వార్తా సంస్థ AFP వెల్లడించింది.  

Donald Trump Twitter Return: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్‌లో మస్క్ ఈ విషయాన్ని చెప్పారు. ఇటీవల ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

మాజీ అధ్యక్షుడు పదవీకాలం చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఖాతాపై నిషేధం విధించారు. ట్విట్టర్ తన విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ ట్రంప్ ఖాతాను నిషేధించింది. ఈ సమావేశంలో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. 'శాశ్వత నిషేధాలు చాలా అరుదుగా ఉండాలి. స్కామ్‌లు లేదా స్పామ్ ఖాతాలకు ఇది వర్తింపజేయాలి. డోనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించడం సరికాదని నేను భావిస్తున్నాను. శాశ్వత నిషేధాన్ని తొలగిస్తాను. అని మస్క్ తెలిపారు.
 
ట్రంప్ ఖాతాను ఎందుకు నిషేధించారు?

జనవరి 2021లో, ట్రంప్ మద్దతుదారులు US పార్లమెంట్‌పై దాడి చేయడంతో మాజీ అధ్యక్షుడి ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. జనవరి 6న పార్లమెంట్‌పై దాడి తర్వాత హింసాత్మక ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున నిషేధం విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఆ సమయంలో, ట్రంప్‌కు ట్విట్టర్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగా, అతను తన మద్దతుదారులను ట్విట్టర్ ద్వారా యుఎస్ పార్లమెంటును ఘెరావ్ చేయాలని కోరారు. ఆయన మద్దతుదారులు మళ్లీ పార్లమెంటులో హింసకు పాల్పడ్డారు. అదే సమయంలో, హింసను ఖండించడానికి బదులుగా.. ట్రంప్ మద్దతుదారులను విప్లవకారులుగా పిలిచారు. హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున ట్రంప్ ఖాతాను నిషేధించారు.

అయితే, మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడయ్యాక, కొత్త యజమాని రాక ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి తిరిగి రావడానికి దారితీస్తుందా అనే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తాను ట్విట్టర్‌కి తిరిగి వెళ్లననీ,  గ‌త కొన్ని వారాల్లో ట్రూత్ సోషల్ (సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్)లో యాక్టివ్‌గా ఉంటాననీ, ఈ వేదికపైకి రావడానికి చాలా మంది ముందుకొచ్చారని.. త‌నకు ఎలోన్ మస్క్ అంటే ఇష్టమ‌ని, కానీ ట్విట్టర్ త‌న‌తో వ్యవహరించిన తీరు పట్ల నిరాశ చెందానని.  ట్విట్టర్‌లోకి తిరిగి రానని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే