6గురు భార్యలు, 54మంది పిల్లలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం యజమాని గుండెపోటుతో మృతి..

By Bukka SumabalaFirst Published Dec 13, 2022, 10:22 AM IST
Highlights

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి యజమానిగా పేరొందిన పాకిస్తానీ వ్యక్తి అబ్దుల్ మాజీద్ మంగల్ 75యేళ్ల వయసులో గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. 

పాకిస్తాన్ : ఆయనకు ఆరుగురు భార్యలు, 54మంది పిల్లలు.. ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి యజమాని. అతని పేరు అబ్దుల్ మజీద్ మంగల్ (75).. ఆయన బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రపంచానికి తెలియజేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దా అయిన అబ్దుల్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అబ్దుల్ మజీద్ మంగల్ డ్రైవర్ గా పని చేసేవాడు. బలూచిస్తాన్ నోష్కి జిల్లా కాలిమంగల్ గ్రామంలో ఉండేవాడు. అతనికి ఆరుగురు భార్యలు. 

అబ్దుల్ పద్దెనిమిదేళ్ల వయసులో తొలి వివాహం చేసుకున్నాడు. ఆ తరువాతి క్రమంలో మరో ఐదుగురికి తన జీవితంలో భాగం చేసుకున్నాడు. కాగా, 2017 లో జనాభా లెక్కల సమయంలో ఈ విషయం తొలిసారిగా ప్రపంచానికి తెలిసింది. జనాభా లెక్కల కోసం అబ్దుల్ ఇంటికి వెళ్లిన సిబ్బంది వివరాలు సేకరించే సమయంలో వారు చెప్పింది విని షాక్ తిన్నారు. అలా అబ్దుల్ భార్యల విషయం, అతని కుటుంబం విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జనాభా లెక్కల్లోనే అతనికి ఆరు మంది భార్యలు 54 మంది పిల్లలు ఉన్నారని  తెలిసింది. దీంతోనే ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజమాని అని గుర్తింపు వచ్చింది. 

కాబోయే భార్యకు ‘గాడిద’ గిఫ్ట్.. పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఏమందంటే..

అబ్దుల్ ఆరుగురు భార్యల్లో.. ఇద్దరు చనిపోయారు. ఈ ఆరుగురు భార్యల ద్వారా అతనికి 54 మంది పిల్లలు సంతానం. వీరిలో 12 మంది రకరకాల కారణాలతో చనిపోయారు. మిగిలిన 42మందిలో 22 మంది అబ్బాయిలు..  20 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో కొంతమందికి పెళ్లిళ్లు అయ్యాయి వారి భర్తలు, భార్యలు, వారికి పుట్టిన పిల్లలు అందరూ కలిసి అబ్దుల్ కుటుంబంలో మొత్తం 150 మంది అవుతారు. ఇంత పెద్ద కుటుంబం ఎవ్వరికీ ఉండదు కాబట్టి అప్పటినుంచి ఆయన అతిపెద్ద కుటుంబ యజమానిగా గుర్తింపు పొందాడు.

click me!