25 ఏళ్లలోపు యువతకు ఉచిత కండోమ్‌లు.. జనవరి నుంచి స్కీమ్ అమలు.. ఎక్కడంటే?

By Mahesh KFirst Published Dec 12, 2022, 12:46 PM IST
Highlights

ఫ్రెంచ్ ప్రభుత్వం ఎస్‌టీఐల నివారణకు, అవాంఛిత గర్భ నిరోధాలకు సంచలన విధానాన్ని ప్రకటించింది. 26 ఏళ్లలోపు యువతకు ఫార్మసీల్లో ఉచితంగా కండోమ్‌లు అందుబాటులో ఉంచుతామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ వెల్లడించారు. గతంలోని స్కీమ్‌లతోపాటు ఇది కూడా అమలు అవుతుందని తెలిపారు.
 

న్యూఢిల్లీ: సెక్సువల్ ఎడ్యుకేషన్ పై సరైన అవగాహన లేదు. థియరీకి, వాస్తవ పరిస్థితులకు చాలా, చాలా వ్యత్యాసం ఉంటున్నది. ఈ వ్యాఖ్యలను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ స్వయంగా పేర్కొన్నారు. అందుకే లైంగిక చర్యల ద్వారా వ్యాపించే వైరస్‌లు పెరిగిపోతున్నాయని అర్థం అవుతున్నది. వీటిని అరికట్టడానికి, అవాంఛిత గర్భాలను నివారించడానికి ఆ దేశం సంచలన నిర్ణయాలు తీసుకున్నది. అందులో ఒకటి యువతకు కండోమ్‌లు అందుబాటులో ఉంచడం.

జనవరి నుంచి దేశంలోని యువతకు అంటే 18 నుంచి 25 ఏళ్లలోపు యువతీ యువకులకు కండోమ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రన్ తెలిపారు. ఫార్మసీల్లో వీటిని వారు ఉచితంగా పొందవచ్చని వివరించారు. ఈ ఆరోగ్యపరమైన నిర్ణయాన్ని గురువారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అంతేకాదు, దీన్ని అవాంఛిత గర్భ నివారణలో ఓ చిన్న విప్లవంగా ఈ నిర్ణయాన్ని ఆయన అభివర్ణించారు.

ఫ్రాన్స్‌లో సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్‌(ఎస్‌టీఐ)ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నది. 2020, 2021 సంవత్సరాల్లో ఫ్రాన్స్‌లో ఇవి 30 శాతం పెరిగాయి.

Also Read: స్కూల్ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు.. నివ్వెరపోయిన టీచర్లు.. షాక్‌లో పేరెంట్స్

ఫ్రాన్స్‌లో సెక్సువల్ ఎడ్యుకేషన్ చుట్టూ అనేక సవాళ్లు ఉన్నాయని అన్నారు. ఈ సబ్జెక్ట్‌లో తాము బాగాలేమని అన్నారు. థియరీకి రియాలిటీ చాలా తేడా ఉంటున్నదని తెలిపారు. ఫ్రాన్స్ ఇది వరకే ఇలాంటి సంచలన విధానాలను అమలు చేస్తున్నది. తాజా విధానంతోపాటు గతంలోని ప్రకటించిన నిర్ణయాలూ ఎప్పటిలాగే అమలవుతాయని అధ్యక్షుడు మ్యాక్రన్ స్పష్టం చేశారు.

గతంలో ఫ్రాన్స్ లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్లు, అవాంఛిత గర్భ నిరోధకానికి పలు చర్యలు తీసుకున్నది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ పై ఫార్మసీల్లో కండోమ్‌లు తీసుకుంటే.. వాటి డబ్బులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని 2018లోనే ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది తొలినాళ్లలోనూ 26 ఏళ్లలోపు మహిళలు అందరికీ గర్భనిరోధకాలను ఉచితంగా అందుబాటులోకి ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు.

తాజా నిర్ణయంతోపాటు ఇప్పటికే అమలు అవుతున్న మహిళలకు ఫార్మసీల్లో కాంట్రసెప్షన్లు, ప్రిస్క్రిప్షన్ లేకున్నా 26 ఏళ్లలోపు మహిళలకు ఎస్‌టీఐ స్క్రీనింగ్స్ ఉచితంగా విధానాలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.

click me!