ఆచారాలు మంట కలిపారని... ఐదుగురు బాలికలు, యువకుడి దారుణహత్య

By Siva KodatiFirst Published Mar 7, 2019, 3:39 PM IST
Highlights

పాకిస్తాన్‌లో గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్ కోహిస్తానీ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్‌లోని అబోటాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు అఫ్జల్‌ను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. 

పాకిస్తాన్‌లో గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్ కోహిస్తానీ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్‌లోని అబోటాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు అఫ్జల్‌ను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు.

వివరాల్లోకి వెళితే... 2012లో ఓ వివాహ వేడుకకు అఫ్జల్‌, అతని సోదరులతో పాటు ఐదుగురు గిరిజన బాలికలు కూడా హాజరయ్యారు. పెళ్లిలో ఆనందంగా వీరంతా కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

ఈ తతాంగాన్ని కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై స్ధానిక ఖాప్ పంచాయతీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచారాలను మంట కలిపారంటూ బాలికలతో పాటు యువకులను చంపేయాల్సిందిగా పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో వీడియోలో కనిపించిన ఐదుగురిని 2012లో వారి కుటుంబసభ్యులు, తోబట్టువులే హత్య చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరి హత్యలు జరిగిన సంవత్సరం తర్వాత అఫ్జల్ సోదరులను సైతం గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.

నాటి నుంచి అఫ్జల్ కూడా ప్రాణభయంతో వివిధ ప్రాంతాలు మారుతూ వస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు, మీడియాకు తెలియజేయడంతో అఫ్జల్ అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడ్డాడు.

ఈ పరువు హత్యలపై అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వైస్ న్యూస్ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ విషయం పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిందిగా ఆయన నిజనిర్థారణ కమిటీ వేశారు. అయితే అవి పరువు హత్యలు కావంటూ కమిటీ నివేదిక సమర్పించింది... అంతేకాకుండా వీడియోలోని బాలికగా ఇద్దరు బాలికలను చూపించింది.

అయితే.... మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతోనే బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ సమయంలో అఫ్జల్ కూడా దారుణ హత్యకు గురికావడంతో పరువు హత్యల వ్యవహరం కీలకమలుపు తిరిగింది. 
 

click me!