యోగా క్లాస్ లో భాగంగా.. ధ్యానం ముద్రలో అచేతనంగా ఉన్నవారిని చూసి.. మాస్ కిల్లింగ్ గా పొరబడ్డాడో పౌరుడు. దీంతో పోలీసులకు ఫోన్ చేయడంతో కాసేపు హడావుడి నెలకొంది.
లండన్ : లండన్ లో జరిగిన ఓ విచిత్ర ఘటన ఇప్పుడు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఓ ప్రాంతంలో మాస్ కిల్లింగ్ జరిగిందంటూ పోలీసులుకు సమాచారం అందింది. వెంటనే వారు సైరన్లు మోగించుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్లారు. తీరా వెళ్లి చూసి అవాక్కయ్యారు. కారణం ఏంటంటే.. అక్కడ యోగా క్లాసులు జరుగుతున్నాయి.
యోగా క్లాసుల్లో భాగంగా.. అందులోని సభ్యులు నేలమీద వెల్లకిలా పడుకున్నారు. కదలక, మెదలక అలా పడుకున్న వారిని చూసిన ఓ వ్యక్తి అది మాస్ కిల్లింగ్ అనుకున్నాడు. వెంటనే బాధ్యతాయుతమైన పౌరుడిగా పోలీసులకు ఫోన్ చేశాడు.
మాలిలోని ఆర్మీ బేస్‌లో ప్రయాణీకుల పడవపై ఉగ్రవాదుల దాడి.. 64 మంది మృతి..
ఈ ఘటనలో చాపెల్ సెయింట్ లియోనార్డ్స్‌లోని నార్త్ సీ అబ్జర్వేటరీ లోపల ఉన్న సముద్రతీర కేఫ్ సమీపంలో ఇది జరిగింది. ఎలాంటి చప్పుడు లేకుండా.. కామ్ గా మెడిటేషన్ చేసుకుంటుంటే చూసి.. అపోహ పడ్డారని తరువాత తెలిసింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
దీనిమీద ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టులో "నిన్న రాత్రి 9.30 గంటలకు చాపెల్ సెయింట్ లియోనార్డ్స్‌లో ఎవరైనా పోలీసు సైరన్‌లు వింటే.. భయపడకండి" అని రాసుకొచ్చారు. "మా భవనంలో ఎవరో సామూహిక హత్యలు జరిగాయని ఎవరో ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు అబ్జర్వేటరీకి వెళ్లారు. అక్కడ చాలా మంది వ్యక్తులు నేలపై పడుకోవడం చూశారు… నిజానికి ఇది యోగాలో ఒకటైన ధ్యానం క్లాస్" అని తెలిపారు.
ఈ కేఫ్ లో క్రమం తప్పకుండా సాయంత్రం వేళల్లో యోగా తరగతులు జరుగుతాయి. "మేము ఏ పిచ్చి కల్ట్ లేదా క్రేజీ క్లబ్‌లలో భాగం కాదు" అని అది చెప్పుకొచ్చింది. అయితే, తమకు కాల్ చేసిన వ్యక్తి "మంచి ఉద్దేశ్యంతో" నే చేసినట్లు లింకన్‌షైర్ పోలీసులు ధృవీకరించారు.