లాటరీలో భర్తకు రూ.12 కోట్లు..షాకిచ్చిన భార్య, ఆస్తిపాయే, సొమ్ములు పాయే

Siva Kodati |  
Published : Feb 15, 2023, 04:01 PM ISTUpdated : Feb 15, 2023, 04:03 PM IST
లాటరీలో భర్తకు రూ.12 కోట్లు..షాకిచ్చిన భార్య, ఆస్తిపాయే, సొమ్ములు పాయే

సారాంశం

లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న చైనాకు చెందిన జోవ్ అనే వ్యక్తికి అతని భార్య షాకిచ్చింది. విషయం చివరికి కోర్ట్ దాకా వెళ్లడంతో స్థానికంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. 


అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టగా.. భార్య రూపంలో ఓ వ్యక్తిని దురదృష్టం వెక్కిరించింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన జోవ్ అనే వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతను ఎగిరి గంతేశాడు. పన్నులు, ఇతర చట్టపరమైన మినహాయింపుల తర్వాత అతనికి రూ.10.22 కోట్లు మిగిలింది. అయితే తనకు లాటరీ తగిలిన విషయాన్ని అతను కనీసం భార్యకు కూడా చెప్పలేదు. కానీ ఇందులో కొంత మొత్తాన్ని తన సోదరికి ఇచ్చాడు. అంతేకాదు.. రూ.85 లక్షలతో తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కోసం మంచి ఫ్లాట్‌ను కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. 

అయితే నిజం నిప్పులాంటిది కావడంతో కొన్నాళ్ల తర్వాత జోవ్ భార్య లిన్‌కు అసలు విషయం తెలిసింది. లాటరీ విషయం చెప్పకుండా దాయడంపై భగ్గుమంది. ఇదో కారణమైతే.. లాటరీ సొమ్ములో కొంత మొత్తం సోదరికి ఇవ్వడం, మాజీ ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడంతో ఆమె కోపం నషాళానికి అంటింది. తనను భర్త మోసం చేశాడంటూ ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లాటరీ సొమ్ముతో పాటు భర్త ఆస్తిని తనకు కూడా సమానంగా పంచాలని విజ్ఞప్తి చేసింది.

ALso REad: 88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. ఆ డబ్బుతో ఏం చేస్తాడంటే?

దీంతో కోర్ట్ ఈ విషయంలో ఎలాంటి తీర్పును వెలువరిస్తుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. అయితే భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. లాటరీ టికెట్‌ను ఇద్దరి డబ్బుతోనే కొని.. లాటరీ తగిలిన విషయాన్ని జోవ్ దాయడాన్ని తప్పుబట్టింది. సోదరికి, మాజీ ప్రేయసికి కూడా లాటరీ మొత్తానికి చెందినదేనని గుర్తించింది. చివరికి లాటరీ తగిలిన సొమ్ములో 60 శాతం (రూ.7.29 కోట్లు) భార్యకు చెల్లించాలని జోవ్‌ను ఆదేశించింది న్యాయస్థానం. అలాగే ఆస్తిని కూడా సమానంగా పంచుతూ తుది తీర్పు వెలువరించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే