భార్యాబిడ్డలు సహా ఐదుగురి కాల్చివేత: నరహంతకుడి ఉరితీత

Siva Kodati |  
Published : Feb 07, 2020, 03:58 PM IST
భార్యాబిడ్డలు సహా ఐదుగురి కాల్చివేత: నరహంతకుడి ఉరితీత

సారాంశం

ఎంత పెద్ద నేరస్థుడైనా శిక్షపడకుండా కొన్నాళ్లు తప్పించుకోగలడు. కానీ పాపం పండిన తర్వాత ఎవరు అతనిని రక్షించలేరు. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. తన భార్య, ఇద్దరు పిల్లలు సహా ఐదుగురిని కాల్చి చంపిన కేసులో దోషిగా తేలిన టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తిని గురువారం ఉరి తీశారు

ఎంత పెద్ద నేరస్థుడైనా శిక్షపడకుండా కొన్నాళ్లు తప్పించుకోగలడు. కానీ పాపం పండిన తర్వాత ఎవరు అతనిని రక్షించలేరు. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. తన భార్య, ఇద్దరు పిల్లలు సహా ఐదుగురిని కాల్చి చంపిన కేసులో దోషిగా తేలిన టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తిని గురువారం ఉరి తీశారు.

అబెల్ ఓచోవా 47పై 2002లో జరిగిన హత్యలకు గాను 17 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం జ్యూరీ అతనిని దోషిగా నిర్థారించి మరణశిక్షను విధించారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6.48 గంటలకు ఓ విషపు ఇంజెక్షన్ ఇచ్చి అనంతరం అబెల్‌ను ఉరి తీసినట్లుగా టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ప్రకటించింది.

Also Read:హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

ఓచోవా 2020లో ఉరి తీయబడిన మూడో ఖైదీ కాగా.. టెక్సాస్‌లో రెండవ వ్యక్తి. 2019లో తొమ్మిది మందిని ఉరి తీసిన టెక్సాస్.. 1976లో యూఎస్ సుప్రీంకోర్టు మరణశిక్షను తిరిగి అమలు చేసినప్పటి నుంచి ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మంది ఖైదీలను ఉరి తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరణశిక్షను తిరిగి అమలు చేస్తున్న ఏకైక పాశ్చాత్య ప్రజాస్వామ్యం అమెరికాయే.

2002 ఆగస్టు 4న కొకైన్‌ను తాగిన 20 నిమిషాల తర్వాత ఓచోవా తన గదిలోకి వెళ్లి 29 ఏళ్ల భార్య సిసిలియా, తొమ్మిది నెలల కుమార్తె అనాహి, మావ బార్టోలో, మరదలు జాకీని కాల్చి చంపాడు.

Also Read:నిర్భయ కేసు: ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం, సుప్రీంలో కేంద్రం పిటిషన్

అక్కడితో ఆగకుండా తన 9 ఎంఎం రుగర్ హ్యాండ్ గన్‌ను రీలోడ్ చేసి తన ఏడేళ్ల కుమార్తె క్రిస్టల్‌ను వెంబడించి చివరికి వంటగదిలో నాలుగుసార్లు కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇదే దాడిలో ప్రాణాలతో బయటపడిన బావ అల్మాను కూడా కాల్చి చంపాడు. అనంతరం తన భార్య కారులో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

కోర్టులో విచారణ సందర్భంగా ఓచోవా తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో పాటు జీవితంపై విరక్తితోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలింది. ఈ నేరాలన్నీ రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష విధించింది. అదే సమయంలో ఓచోబా తన ఉరిని ఆపాల్సిందిగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం కొట్టివేయడంతో అధికారులు ఉరిశిక్షను అమలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే