21 సంవత్సరాలుగా భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని..చివరికి..

Published : May 10, 2022, 07:15 AM IST
21 సంవత్సరాలుగా భార్య శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని..చివరికి..

సారాంశం

ఓ భర్త తన భార్య చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమె శవానికి అంతిమ సంస్కారాలు చేయకుండా శవపేటికలో పెట్టి ఇంట్లనే దాచుకున్నాడు. అలా 24 సంవత్సరాలు గడిచాక...

బ్యాంకాక్ :  ఎవరైనా చనిపోతే వారిని అదే రోజు Funerals నిర్వహిస్తారు. లేదంటే కుటుంబసభ్యులు వచ్చేవరకు ఉంచి.. చనిపోయిన మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ,  ఓ వ్యక్తి మాత్రం తన భార్య dead bodyని 21సంవత్సరాలు ఇంట్లోనే దాచుకున్నాడు. చివరికి భయమేసి ఓ Charitable Trust వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరాడు. వివరాల్లోకి వెళితే..  బ్యాంకాక్కు చెందిన  ఓ వ్యక్తి (72)  తన భార్య ఇద్దరు పిల్లలతో  నివసించేవాడు.  2001లో  ఆయన భార్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. 

దీంతో ఆమె శవాన్ని ఓ శవపేటికలో పెట్టి ఇంట్లోనే దాచి పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు ఆయన ప్రవర్తనతో విసుగు వచ్చి ఇద్దరు కొడుకులు ఆయనను వదిలి వెళ్ళిపోయారు. అప్పటినుంచి అతనొక్కడే మృతదేహంతో కలిసి ఉంటున్నాడు. చివరికి  21 సంవత్సరాల తర్వాత చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం వేసింది. దీంతో అతనికి గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాయం చేసిన ఓ చారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గరికి వెళ్లి ఈ విషయమంతా చెప్పాడు. తన భార్య శవానికి అంత్యక్రియలు చేయాల్సిందిగా వాళ్ళని అభ్యర్థించాడు. దీంతో వాళ్లు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వ్యక్తి మాత్రం భార్య మృతదేహం వద్ద కూర్చుని ‘మీరు చిన్న వ్యాపార పని మీద ఇంటి నుంచి బయటకు వెళుతున్నారు. ఎక్కువ రోజులు అక్కడ ఉండరు. తిరిగి మళ్ళీ వచ్చేస్తారని నేను మీకు మాటిస్తున్నాను’ అంటూ రోధించాడు. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో నిరుడు డిసెంబర్ లో ఓ భార్య ఇలాంటి పనే చేసింది. తన సోదరుడు పది రోజులుగా కనబడడం లేదని ఒక వ్యక్తి పోలీసులకు Complaint చేశాడు. పోలీసులు అతని ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. తాళం పగులగొట్టి చూస్తే.. అక్కడ ఆ వ్యక్తి dead body కనబడింది. ఈ ఘటన uttar pradesh రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే…  ఉత్తరప్రదేశ్లోని బాగా పూర్ గ్రామానికి చెందిన కమలేష్ నలబై అనే వ్యక్తి కనబడటం లేదంటూ అతని సోదరుడు రామ్ కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ఇంటికి  వెళ్లి చూస్తే Lock వేసి ఉంది. 

కమలేష్ భార్య సునీత, కుమారుడు ఆదర్శ్ ఎక్కడికి వెళ్లారు ఎవరికీ తెలియదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ  వారికి కమలేష్ శవం దొరికింది. కమలేష్ ను అతని భార్య సునీత murder చేసి ఉంటుందని కమలేష్ సోదరుడు రామ్ కిషన్ పోలీసులకు చెప్పాడు.  సునీత ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. సునీత ను పోలీసులు విచారణ పేరుతో Torture పెడతారన్న భయంతో  ఆమె కుమారుడు ఆదర్శ్  పోలీసులకు నిజం చెప్పాడు.  

తన తండ్రి కమలేష్ తాగుబోతు అని… రోజు ఇంటికి తాగి వచ్చి తనని,  తన తల్లిని చితకబాదేవాడని ఆదర్శ చెప్పాడు. ఒకరోజు తల్లి కొడుకులు కలిసి కమలేష్ ని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు హత్య చేశాక శవాన్ని ఏం చేయాలో తెలియక ఇంట్లోనే పెట్టి.. తాము పారిపోయామని ఆదర్శ్ పోలీసులకు తెలిపాడు.  పోలీసులు  సునీత,  ఆమె కుమారుడు ఆదర్శ్ ల మీద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే