మాలిలో బస్ బ్లాస్ట్.. 11 మంది స్పాట్ డెడ్.. 50కి పైగా క్షతగాత్రులు

Published : Oct 14, 2022, 12:30 PM ISTUpdated : Oct 14, 2022, 12:34 PM IST
మాలిలో బస్ బ్లాస్ట్.. 11 మంది స్పాట్ డెడ్.. 50కి పైగా క్షతగాత్రులు

సారాంశం

మాలిలో ఓ బస్ట్ పేలుడు పదార్థాన్ని తాకడంలో పేలి పోయింది. 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 53 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.  

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మాలిలో బస్ బ్లాస్ట్ అయింది. ఓ పేలుడు పదార్థాన్ని బస్సు ఢీకొనడంతో ఈ పేలుడు సంభవించింది. ఇందులో 11 మంది అక్కడికక్కడే మరణించారు. కాగా, మరో 53 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వివరించాయి. ఈ ఘటన గురువారం సెంట్రల్ మాలిలో చోటుచేసుకుంది.

మోప్తి ఏరియాలో బండియగరా, గౌండకలను కలిపే రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారంతా సాధారణ పౌరులే. అయితే, ఈ రీజియన్ ఉగ్రవాదులకు అడ్డగా ఉన్నది. ఎక్కువ మంది సాయుధులు ఇక్క తిరుగుతూ ఉంటారు.

Also Read: China Bomb Blast: చైనాలో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 42 మందికి తీవ్ర గాయాలు..

దశాబ్దానికి పైగా కాలం నుంచే మాలిలో తిరుగుబాటుదారుల ముప్పును కొలిక్కి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, అవి సఫలం కాలేదు. ఈ రెబల్ గ్రూపులు వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి. మరెందరినో ఇల్లు వదిలిపెట్టి శరణార్థులుగా మార్చి వేసింది. 

ఇక్కడి రెబల్స్ ఎక్కువగా మైన్స్, ఐఈడీలను విధ్వంసానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..