దారుణం.. నార్త్ కరోలినాలోని రాలీలో కాల్పులు.. ఆరుగురి మృతి..

Published : Oct 14, 2022, 09:05 AM IST
దారుణం.. నార్త్ కరోలినాలోని రాలీలో కాల్పులు.. ఆరుగురి మృతి..

సారాంశం

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. చనిపోయిన వారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. 

అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాస ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని వార్తా సంస్థ రాయిట‌ర్స్ నివేదించింది. నార్త్ కరోలినా రాష్ట్ర మేయర్ రాలీ మేయర్ మేరీ-ఆన్ బాల్డ్విన్ గురువారం సాయంత్రం దీనిని ధృవీక‌రించారు. 

గురువారం సాయంత్రం 5 గంటలకు న్యూస్ నది గ్రీన్‌వేపై అనేక మంది వ్యక్తులు కాల్పులు జ‌రిపారు. దీంతో పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. హెడింగ్‌హామ్‌లో అనేక పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో షూట‌ర్ అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నారు. అత‌డిని పట్టుకోవ‌డానికి లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పనిచేస్తున్నారు.

అలా అయితే, మూడో ప్రపంచ యుద్ధ‌మే.. మ‌రోసారి ఉక్రెయిన్ కు నాటో స‌భ్య‌త్వంపై ర‌ష్యా వార్నింగ్ !

అయితే ఈ కాల్పులు జ‌రుపుతున్న స‌మ‌యంలో ‘‘ రాలీ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం ఆస్ప్రే కోవ్ డ్రైవ్, బే హార్బర్ డ్రైవ్ సమీపంలోని న్యూస్ రివర్ గ్రీన్వే ప్రాంతంలో యాక్టివ్ షూటింగ్ జ‌రుగుతోంది. ఆ ప్రాంతంలోని నివాసితులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాం.’’ అని రాలీ పోలీసులు ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల్లో క్షతగాత్రులను సమీపంలోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. హెడింగ్ హామ్ పరిసరాల్లోని విభాగాలు మూసివేయబడ్డాయి. ఆ ప్రాంతంలోని నివాసితులు అధికారుల సూచ‌న‌లు పాటించాల‌ని స్థానిక యంత్రాంగం కోరింది.

హిమాచ‌ల్ లో ముందుగానే దీపావ‌ళి వ‌చ్చిందన్న ప్రధాని మోడీ.. ఉనాలో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన 

కాల్పుల ఘటన అనంతరం నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ రాలీ మేయర్ తో మాట్లాడారు. ‘‘నేను మేయర్ బాల్డ్విన్ తో మాట్లాడాను. తూర్పు రాలీలో యాక్టివ్ షూటర్ కు ఎదుర్కొనేందుకు సహాయాన్ని అందించాలని రాష్ట్ర అడ్మినిస్ట్రేష‌న్ ను ఆదేశించాను. రాష్ట్ర, స్థానిక అధికారులు రంగంలోకి దిగి షూటర్ ను ఆపడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి పనిచేస్తున్నారు" అని కూపర్ ట్వీట్ చేశారు.

ముఖ్యంగా మెక్కానెల్ ఆలివర్ డ్రైవ్, టార్హీల్ క్లబ్ డ్రైవ్, ఓల్డ్ మిల్బర్నీ రోడ్ ప్రాంతంలోని నివాసితులు తమ ఇళ్లలోనే ఉండాలని ఆయ‌న సూచించారు. కాగా ఈ ఘటన తరువాత దాదాపు ప‌దుల సంఖ్య‌లో ఎమర్జెన్సీ వాహ‌నాలు రోడ్లపైకి వ‌చ్చి వ‌రుస‌గా ఉన్నాయి.

కేరళ నరబలి కేసు: పోస్టుమార్టం పూర్తి.. వెలుగులోకి మ‌రిన్ని విష‌యాలు

కాగా.. అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ఈ అక్టోబర్ 9వ తేదీన నార్త్-సౌత్ కరోలినాలోని ఓ ఇంట్లో షూటింగ్ జరిగింది. ఈ ఘటనలో 5 గురు చ‌నిపోయారు. ఈ కాల్పుల స‌మ‌యంలో నలుగురు అక్కడికక్కడే మ‌ర‌ణించ‌గా.. ఓ వ్య‌క్తి గాయ‌ప‌డ్డారు. అత‌డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌కు ముందు రోజు రాత్రి ఫ్లోరిడాలోని టంపాలో కూడా కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో ఒకరు చ‌నిపోయారు. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !