పాక్ మీడియాలో ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ .. ఏమంటున్నాడో తెలుసా?

Published : May 20, 2025, 11:03 PM IST
PAKISTAN

సారాంశం

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ ఖలిస్తానీ ఉగ్రవాదులు శత్రుదేశానికి వంతపాడుతున్నారు. తాజాగా ఖలిస్తాని ఉగ్రవాది ఒకరు పాక్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.  

నిషేదిత ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) అధిపతి, ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ పాకిస్తాన్ మీడియాలో కనిపించి భారత్‌పై విమర్శలు గుప్పించాడు. ఆయన పాకిస్తాన్‌ను పొగుడుతూ, సిక్కులు భారత్ కోసం పోరాడటానికి నిరాకరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. గుర్పత్వంత్ పన్నూన్ పాక్ మీడియాతో మట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

 

 

జియో న్యూస్‌లో ఇటీవల ప్రసారంచేసిన ఈ ఇంటర్వ్యూలో పన్నూన్ ‘సిక్కులు భారత్ కోసం పోరాడటానికి నిరాకరిస్తున్నారు’ అని పేర్కొన్నాడు,   ‘నారా-ఎ-తక్బీర్’ అంటూ ఇస్లామిక్ నినాదం కూడా చేశాడు.  పాకిస్తాన్‌కు మద్దతుగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని కూడా అతడు మీడియా ముందే నినదించాడు. 

పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు ఎప్పటినుంచో అనుమానించబడుతున్న SFJ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పుడోంది. ఖలిస్తానీ ప్రచారాన్ని వ్యాప్తి చేయడం, పంజాబీ యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, ఆయుధాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణా   వంటివి చేస్తుంది ఈ సంస్థ.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే