Trump: బైడెన్ క్యాన్సర్ విషయం ఎందుకు దాచిపెట్టారు

Published : May 20, 2025, 11:44 AM IST
Joe biden

సారాంశం

బైడెన్ క్యాన్సర్ విషయాన్ని ఆలస్యం చేసినట్లు ట్రంప్ ఆరోపించారు. జిల్‌పై ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. రాజకీయంగా ఇది పెద్ద చర్చకు దారితీస్తోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న విషయం తాజాగా అధికారికంగా వెల్లడి కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ విషయాన్ని గతంలో ఎందుకు వెల్లడించలేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.ఈ అంశంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, బైడెన్ ఆరోగ్య పరిస్థితిని ఆలస్యంగా వెల్లడించడాన్నిఆయన తప్పు పట్టారు. ట్రంప్ మాటల్లో, గ్లీసన్ స్కోరింగ్ ప్రకారం బైడెన్‌కు 9 స్కోరు వచ్చినట్టు చెబుతున్నారు. ఇది సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువ. ఇంత స్కోరు రావడానికి చాలా కాలం పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

రాజకీయ విషయం కాదు..

బైడెన్ వైద్యుడే గతంలో ఆయన మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారని గుర్తు చేస్తూ, ఇక్కడ అసలు నిజాలు దాచే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది రాజకీయ విషయం కాదని, దేశ భద్రతకే సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. ప్రజలకు నేతల ఆరోగ్య పరిస్థితులపై పూర్తి సమాచారం ఉండాల్సిందేనని, అలాంటిదే ఇది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇక ఈ వ్యవహారంపై ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సైతం తీవ్రంగా స్పందించారు. జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ వైద్యురాలు అయినప్పటికీ, ఆమె భర్త ఆరోగ్యంపై సరైన సమాచారం ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. జిల్ బైడెన్ ఒక నకిలీ డాక్టర్‌ అంటూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

బైడెన్ ఆరోగ్యం విషయంలో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా క్యాన్సర్‌ విషయాన్ని చాలా ఆలస్యంగా బయటపెట్టడంపై అమెరికాలో వివాదం ముదురుతోంది. ఈ ఆరోగ్య అంశం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే