పాక్‌కు షాక్, కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం: మేం జోక్యం చేసుకోమన్న తాలిబన్

Siva Kodati |  
Published : May 19, 2020, 10:02 PM IST
పాక్‌కు షాక్, కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం: మేం జోక్యం చేసుకోమన్న తాలిబన్

సారాంశం

కాశ్మీర్ అంశం విషయంలో పాకిస్తాన్‌కు తాలిబన్లు షాకిచ్చారు. కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. 

కాశ్మీర్ అంశం విషయంలో పాకిస్తాన్‌కు తాలిబన్లు షాకిచ్చారు. కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం తమ విధానం కాదని తేల్చి చెప్పింది.

కాశ్మీర్ జీహాదీలో తాలిబన్ చేరిపోతోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో .. ఆ సంస్త రాజకీయ విభాగం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్గానిస్తాన్ మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ స్పందించారు.

Also read:వారికి, మాస్క్‌లతో శ్వాసకోశ ఇబ్బందులు.. బ్రిటన్ శాస్త్రవేత్తల హెచ్చరిక

కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ మీడియాలో ప్రచురించిన ప్రకటన పూర్తిగా తప్పన్న ఆయన.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ ఎమిరేట్ స్పష్టమైన విధానమని తెలిపారు.

ఢిల్లీని లక్ష్యం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కాశ్మీర్‌లో జిహాదీ పేరిట పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్ధతివ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తప్పుబట్టారు.

Also Read:వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడికి కొత్త డ్రగ్: చైనా శాస్త్రవేత్తలు

మరోవైపు తాలిబన్ ప్రకటన విశ్వసనీయతపై కాబూల్, ఢిల్లీలోని దౌత్యవర్గాలను సంప్రదించింది. ఆ సంప్రదింపులు ఫలితంగానే ఎమిరేట్స్ వివరణ వెలువడిందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

అఫ్గనిస్తాన్‌లో రాజకీయ సుస్థిరత్వం కోసం భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ఇటీవల అమెరికా కోరిన విషయం తెలిసిందే. భారత్ చొరవతో ఆఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొంటుందని అగ్రరాజ్యం ఆశాభావం వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?