రెండేళ్ల వయస్సులో కిడ్నాప్: 32 ఏళ్ల తర్వాత పేరేంట్స్‌ను చేరుకొన్న కొడుకు

By narsimha lodeFirst Published May 19, 2020, 6:24 PM IST
Highlights

కిడ్నాప్ కు గురైన వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొన్నాడు. తన తల్లి దండ్రుల వద్దకు చేరుకొన్న ఆ వ్యక్తి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కొడుకు కోసం ప్రయత్నించిన దంపతులు చాలా ఏళ్ల వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

బీజింగ్:


కిడ్నాప్ కు గురైన వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొన్నాడు. తన తల్లి దండ్రుల వద్దకు చేరుకొన్న ఆ వ్యక్తి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కొడుకు కోసం ప్రయత్నించిన దంపతులు చాలా ఏళ్ల వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని గ్జియాన్  పట్టణంలో 1988లో రెండేళ్ల వయస్సున్న మావో ఇన్ కిడ్నాప్‌కు గురయ్యాడు. మావో ఇన్ కోసం అతని తల్లి లీ జింగ్జీ తన ఉద్యోగాన్ని కూడ వదిలేసింది. కొడుకు ఫోటోను ముద్రించి దేశంలోని సుమారు 10 ప్రావిన్స్ లలోని పలు పట్టణాల్లో కరపత్రాలను పంచిపెట్టారు.

తాను నివాసం ఉన్న పట్టణంలో ప్రతి ఇంటిని వెతికారు. కానీ, ఆమెకు తన కొడుకు ఆచూకీ దొరకలేదు. అంతేకాదు పలు టెలివిజన్ ఛానెల్స్ లో కూడ తన కొడుకు ఫోటో తో కూడ ప్రచారం నిర్వహించినా కూడ ఫలితం లేకపోయింది.

అయితే తన కొడుకును పోలిన సుమారు 300 మంది చిన్నారులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. కానీ, ఏ ఒక్కరూ కూడ మావో ఇన్ గా తేలలేదు. 2007లో బేబీ కమ్ బ్యాక్ హోమ్ పేరుతో ఆమె వాలంటరీ గ్రూప్ ను ప్రారంభించారు. ఈ గ్రూప్ ద్వారా 29 మంది చిన్నారులను తమ కుటుంబసభ్యుల చెంత వద్దకు పంపారు.

తన కొడుకు కొరకు మావో ఇన్ పేరేంట్స్ ప్రయత్నాలను మానలేదు. అయితే వారికి పోలీసుల నుండి వచ్చిన సమాచారం సంతోషాన్ని కల్గించింది.

also read:వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడికి కొత్త డ్రగ్: చైనా శాస్త్రవేత్తలు

గత ఏప్రిల్‌లో సిచువాన్‌ ప్రావిన్సులో ఓ వ్యక్తి నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఏళ్ల కిందట తాము బాలుడిని దత్తత తీసుకున్నామని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 34 ఏళ్ల వ్యక్తికి ఫేషియల్ గుర్తింపుతో పాటు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను మావో ఇన్ గా తేలింది. 

మావో ఇన్‌ ను పెంచిన పేరేంట్స్   గూ నింగింగ్‌గా పిలుస్తారు. మావో ఇన్ డెకరేషన్ వ్యాపారం చేస్తున్నారు. అయితే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని మావో ఇన్ భావిస్తున్నాడు. 

మావో ఇన్ ను పెంచిన తల్లిదండ్రులకు కిడ్నాపర్లు రూ. 69 వేలకు విక్రయించారని పోలీసులు తెలిపారు. మావో ఇన్ తల్లి పుట్టిన రోజునే కొడుకు దొరికిన విషయాన్ని పోలీసులు చెప్పారు. 32 ఏళ్ల తర్వాత కొడుకును చూసుకోవడంతో ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.

click me!