అమెరికా అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్‌కు బదిలీ చేసిన జో బైడెన్.. ఎందుకంటే?

Published : Nov 20, 2021, 01:29 PM ISTUpdated : Nov 20, 2021, 01:37 PM IST
అమెరికా అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్‌కు బదిలీ చేసిన జో బైడెన్.. ఎందుకంటే?

సారాంశం

అమెరికా అధ్యక్ష బాధ్యతలను జో బైడెన్ తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బదిలీ చేశారు. ఆయన కొలనోస్కోపీ చేసుకోనుండటంతో అనస్థీషియా తీసుకోనున్నారు. దీంతో ఆయన మత్తులో ఉంటారు. కాబట్టి, ఆయన తిరిగి వచ్చే వరకు అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్ నిర్వర్తించనున్నారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తొలి మహిళా మరో రికార్డు నెలకొల్పారు.  

న్యూఢిల్లీ: మన దేశ మూలాలున్న కమలా హ్యారిస్(Kamala Harris) అమెరికా(America) ఉపాధ్యక్ష పదవిని అధిరోహించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అమెరికా చరిత్రలోనూ తొలి మహిళా ఉపాధ్యక్షురాలి(First Woman Vice President)గా రికార్డు తిరగరాశారు. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు జో బైడెన్(Joe Biden) వయసు రీత్యా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు సన్నగిల్లుతాయని, అప్పుడు అధ్యక్ష బరిలో ప్రధానంగా కమలా హ్యారిస్ నిలుస్తారని, తద్వారా అధ్యక్ష పదవినీ పొందడానికి ఆమెకు అవకాశాలున్నాయని విశ్లేషణలు వచ్చాయి. అయితే, వచ్చే ఎన్నికల సంగతి పక్కన బెడితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్ స్వయంగా చూస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు అందుకున్న తొలి మహిళగానూ కమలా హ్యారిస్ మరోసారి చరిత్రను తన పేర లిఖించుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కదా.. అధ్యక్ష బాధ్యతలు(Presidential Powers) ఉపాధ్యక్షురాలి కమలా హ్యారిస్ ఎలా నిర్వహిస్తారన్న సందేహాలు రావడం సహజమే. అయితే, అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్ కొంత కాలం మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకూ ఓ కారణం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలనోస్కోపీ చేసుకోబోతున్నారు. కాబట్టి, ఆ కాలంలో ఆయన అనస్థీషియ తీసుకోనున్నారు. అంటే మత్తులో ఉంటారు. కాబట్టి, ఈ కొలనోస్కోపీ పూర్తయ్యే వరకు అమెరికా రాజ్యాంగ ఆదేశాల అనుసారం ఆమెకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

Also Read: కమలా హ్యారీస్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు.. అధ్యక్షురాలు కావాలంటూ పూజలు....

శుక్రవారం ఉదయమే జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఆయన వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌కు వెళ్లిపోయినట్టు శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొలనోస్కోపీ సమయంలో జో బైడెన్ అనస్థీషియలో ఉంటారు కాబట్టి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బదిలీ చేశారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ వివరంచారు. 2002, 2007లోనూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ కారణంతోనే అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారని సాకీ గుర్తు చేశారు. జో బైడెన్ మళ్లీ వచ్చి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు ఉపాధ్యక్షురాలు తన వెస్ట్ వింగ్‌లోని కార్యాలయం నుంచి బాధ్యతలు నిర్వహిస్తారని వివరించారు.

78 ఏళ్ల జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ 2019 డిసెంబర్‌లోనే అన్ని రకాల ఆరోగ్య చికిత్సలు చేసుకున్నారు. ఆయన ఫిట్‌గా ఉన్నారని వైద్యులూ స్పష్టం చేశారు. ఆ తర్వాతే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అయితే, ఆయన కొలనోస్కోపీ రోటీన్‌గా చేసుకుంటుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం తీసుకున్న తర్వాత ఆయన తొలిసారిగా కొలనోస్కోపీ చేసుకోబోతున్నారు. ఈ శనివారంతో ఆయన 79వ పడిలో అడుగుపెడుతున్నారు.

Also Read: మోదీకి కమలా హ్యారీస్ ఫోన్... వ్యాక్సిన్లు పంపిస్తున్నందుకు ప్రధాని కృతజ్ఞతలు...

2009 నుంచి జో బైడెన్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్‌గా డాక్టర్ కెవిన్ ఓ కానర్ సేవలందిస్తున్నారు. 2019లో అన్ని పరీకక్షలు చేసుకున్నప్పుడు జో బైడెన్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడానికి అన్ని విధాల యుక్తులు కలిగి ఉన్నారని ఈ వైద్యుడే చెప్పారు. అమెరికా అత్యధిక వయోధిక ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ రికార్డుల్లోకి ఎక్కారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?