కుల్‌భూషణ్ జాదవ్‌కి ఊరట: ఐసీజే ఒత్తిళ్లతో దిగొచ్చిన పాక్ సర్కార్

By narsimha lodeFirst Published Nov 17, 2021, 10:07 PM IST
Highlights

పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కుల్‌భూషన్ జాదవ్ కు ఊరట లభించింది. ఉరి శిక్షఫై అప్పీల్ చేసుకొనేందుకు అవకాశం దక్కింది. ఈ మేరకు పాకిస్తాన్ పార్లమెంట్ చట్టం చేసింది. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోర్టులో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్ కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాకిస్తాన్ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్ చేసుకొనేందుకు కుల్‌భూషణ్ కు అనుమతి లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఒత్తిళ్లతో పాకిస్తాన్ పార్లమెంట్ దీనిపై చట్టం చేసింది. కుల్‌భూషణ్ కు అప్పీల్ కు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. కుల్‌భూషణ్ జాదవ్ అప్పీల్‌కు వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2020లోనే పార్లమెంట్లో ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 2020లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ సర్కార్ Kulbhushan Jadhav విషయంలో icj తీర్పును దృష్టిలో ఉంచుకొని జాతీయ ఆర్డినెన్స్ ను సమర్పించారు. అయితే ఈ సమయంలో విపక్షాలు  నిరసనకు దిగాయి.ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ రివ్యూ, రీకన్సిడరేషన్ ఆర్డినెన్స్ 2020 ఆర్డినెన్స్ గత ఏడాది మే 20న అమల్లోకి వచ్చింది.

50 ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ 2017 ఏప్రిల్ గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై pakistan మిలటరీ కోర్టు మరణశిక్ష విధించింది. జాదవ్ కు కాన్సులర్ యాక్సెస్ నిరాకరించడం, మరణాన్ని సవాల్ చేయడం కోసం  భారత్ పాకిస్తాన్ పై ఐసీజేని ఆశ్రయించింది. దీంతో 2019 జూలైలో అంతర్జాతీయ న్యాయ స్థానం కీలకమైన తీర్పును వెలువరించింది. పాకిస్తాన్ తప్పనిసరిగా సమర్ధవంతమైన సమీక్ష, పున:పరిశీలను చేపట్టాలని ఆదేశించింది. జాదవ్ క కాన్సులర్ యాక్సెస్ ను మంజూరు చేయాలని తీర్పు ఇచ్చింది.

also read:జైల్లో కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత అధికారి

గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చిలో కుల్‌భూషన్ జాదవ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన ఏడాదిలోనే మరణశిక్షను విధించింది పాకిస్తాన్ మిలటరీ కోర్టు. మాజీ నేవీ అధికారిపై మోపిన ఆరోపణలను భారతదేశం తిరస్కరించింది. కుల్‌భూషణ్ జాదవ్ ను ఇరాన్ ఓడరేవులోని చాబహార్ నుండి పాకిస్తాన్ కు చెందిన వారు కిడ్నాప్ చేశారని ఆరోపణలున్నాయి.  2018లో జాదవ్ ఉరిశిక్షపై అంతర్జాతీయ న్యాయ స్థానం స్టే విధించింది.

ఇస్లామాబాద్ హైకోర్టు లోని ప్రధాన న్యాయమూర్తి అధర్ మినాల్లా జస్టిస్ అమీర్ ఫరూక్ ,జస్టిస్ మియాంగుల్ హసన్ జౌరంగజేబులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం  జాదవ్ కు న్యాయవాదిని నియమించడంపై న్యాయ మంత్రిత్వశాఖ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించింది.న్యాయవాది నియామకం కోసం భారత్ ను సంప్రదించేందుకు మరో ప్రయత్నం చేయాలని అధికారులను కోరుతూ  మే  5న ఉత్తర్వులు జారీ చేశామని పాకిస్తాన్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ విషయమై భారత్ కు సమాచారం అందించామని అయితే ఇప్పటివరకు ఇండియా నుండి స్పందన రాలేదని  కోర్టుకు తెలిపారు.

జాదవ్ ను ప్రత్యేక గదిలో కాన్సులర్ యాక్సెస్ చేయాలని భారత్ కోరుకుంటుందన్నారు. అయితే అధికారులు అతనిని భారత ప్రతినిధులతో ఒంటరిగా వదిలిపెట్టే ప్రమాదం లేదని కోర్టుకు ఖాన్ తెలిపారు. మరణశిక్ష విధించిన కుల్‌భూషణ్ జాదవ్ దోషిగా నిర్ధారించిన సైనిక న్యాయ స్థానం విధించిన శిక్షలను సమీక్షించేందుకు కోర్టులో న్యాయవాదిని నియమించేందుకు గత నెలలో పాకిస్తాన్ లోని ఒక ఉన్నత న్యాయస్థానం భారత్ కు మరింత సమయం ఇచ్చింది.

 

click me!