
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ పై కత్తి దాడితో ప్రపంచవ్యాప్తంగా మేధావులు, భావ ప్రకటన స్వేచ్ఛను కోరుకునేవారు, రచయితలు నివ్వెరపోయారు. ఇప్పటికీ ఆయన ఇంకా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఉన్నారు. సల్మాన్ రష్దీపై దాడి ఖండిస్తూ హ్యారీ పోటర్ సిరీస్ రచయిత్రి జేకే రోలింగ్ ఓ ట్వీట్ చేసింది. ఆందోళనకర వార్త.. అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆ తర్వాత.. ఈ వార్త తనను కలచి వేసిందని, ఆయన ముందు కోలుకోవాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్‌లో ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘డోంట్ వర్రీ.. నెక్స్ట్ నీ వంతే’ అంటూ కామెంట్ చేశాడు.
సల్మాన్ రష్దీ పై దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఈ బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. సల్మాన్ రష్దీ ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారని, ఆయనకు వెంటిలేటర్ తొలగించారని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, ఈ వ్యవధిలోనే జేకే రోలింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ రష్దీ పై దాడిని ఖండిస్తూ ఓ ట్వీట్ ఆమె చేశారు. ఈ ట్వీట్ కింద ఓ దుండగుడు.. డోంట్ వర్రీ.. నెక్స్ట్ నీ వంతే అంటూ బెదిరించాడు. అంతేకాదు, సల్మాన్ రష్దీ పై దాడి చేసిన దుండగుడిపై ప్రశంసలు కురిపించారు. ఆయన షియా రివల్యూషనరీ ఫైటర్ అని పొగిడారు. మరణించిన అయతొల్లా రొహుల్లాహ్ ఖొమెనెయ్ జారీ చేసిన ఫత్వాను పాటించాడని సమర్థించారు.
ఈ కామెంట్ గురించి తనకు తెలియగానే జేకే రోలింగ్ ట్విట్టర్ సపోర్ట్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ సపోర్ట్.. ఈ విషయంలో తనకు ఏమైనా సహకరించగలరా? అంటూ రిక్వెస్ట్ పెట్టింది. దీనికి అనూహ్యంగా ట్విట్టర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయని సమాధానం వచ్చింది. ఆ కామెంట్ తన రూల్స్ ఉల్లంఘించలేదని సమాధానం వచ్చింది. దీంతో ఆమె ట్విట్టర్ సపోర్ట్ ఫీడ్‌లోని కొన్ని నిబంధనలు రాసి పెట్టి ట్విట్టర్‌ను నిలదీసింది.
ఈ బెదిరింపులు, ఇతరత్రాలపైనా పోలీసులు పరిశీలనలు జరుపుతున్నారని ఆమె మరో ట్వీట్‌లో తన ఫాలోవర్లకు తెలియజేసింది. పోలీసులు ఇప్పటికే ఈ అంశాలను చూస్తున్నారని.. ఫాలోవర్ల మద్దతుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.