Salman Rushdie: సల్మాన్ రష్దీ మాట్లాడుతున్నారు.. వెంటిలేటర్ తొలగించారు: సన్నిహితులు

By Mahesh KFirst Published Aug 14, 2022, 2:07 PM IST
Highlights

సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మాట్లాడుతున్నారనీ వివరించారు. నిన్న సాయంత్రమే రష్దీ సన్నిహితులు ఒకరు ఈ ట్వీట్ చేశారు. ది సాతానిక్ వెర్సెస్ రాసిన సల్మాన్ రష్దీకి ఎన్నో మరణ బెదిరింపులు వచ్చాయి
 

న్యూఢిల్లీ: ది సాతానిక్ వెర్సెస్ రాసిన ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ ప్రస్తుతం మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌ను వైద్యులు తొలగించారని వివరించారు. అమెరికాలోని ఓ వేదిక పై ప్రసంగించడానికి వెళ్లిన సల్మాన్ రష్దీపై కత్తి దాడి జరిగింది.

సల్మాన్ రష్దీ మెడపై, పొట్టలోనూ పలుమార్లు కత్తితో పొడిచారు. 20 సెకండ్ల వ్యవధిలోనే సుమారు 10 నుంచి 15 సార్లు కత్తి పోట్లకు సల్మాన్ రష్దీ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు నిందితుడిని అరెస్టు చేశాయి. సల్మాన్ రష్దీని వెంటనే చాపర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరిగి చాలా గాయపడ్డ సల్మాన్ రష్దీకి హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఆయన కన్నుకోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని సల్మాన్ రష్దీ ఏజెంట్ ఆండ్రూ విలీ నిన్న అన్నారు.

తోటి రచయిత ఆతిష్ తసీర్ సల్మాన్ రష్దీ ఆరోగ్యానికి సంబంధించి నిన్న సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. సల్మాన్ రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్ నుంచి విముక్తి పొందాడని తెలిపారు. ఆయన మాట్లాడుతున్నారని (జోకులు కూడా వేస్తున్నారని) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రష్దీ ఏజెంట్ ఆండ్రూ వీలి కూడా ధ్రువీకరించారు. 

నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషన్, రీట్రీట్ సెంటర్ చాతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో సల్మాన్ రష్దీ ప్రసంగించడానికి వెళ్లారు. సల్మాన్ రష్దీపై హాది మాటర్ దాడికి దిగినట్టు భద్రతా బలగాలు చెబుతున్నాయి. అయితే, ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు. తాను ఈ హత్య చేయలేదని హాది మటర్ తెలిపారు. కాగా, ఇది ప్రీప్లాన్డ్ నేరం అని ప్రాసిక్యూటర్ వాదించారు.

click me!