పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ఈజీ కాదు - మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

By Sairam IndurFirst Published Jan 23, 2024, 4:14 PM IST
Highlights

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి వచ్చే నెల 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం అంత సులువైన పని కాదని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ అన్నారు. ఆ దేశంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మన్ సెహ్రా నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ ప్రపంచం కంటే వెనుకబడిందని, దేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

184 మంది మయన్మార్ సైనికులను స్వదేశానికి పంపిన ఇండియా.. ఎందుకంటే ?

Latest Videos

పాకిస్థాన్ ను తాను ప్రధానిగా ఉన్న సమయంలో తన ప్రభుత్వం డాలర్ ను 104 కు పరిమితం చేసిందని అన్నారు. అలాగే నగదు కొరత ఉన్న దేశం నుండి లోడ్ షెడ్డింగ్ ను తొలగించిందని ఆయన తెలిపారని ‘జియో టీవీ’ నివేదించింది. 2013 ఎన్నికలను గుర్తు చేస్తూ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ కెపిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను సంప్రదించారని అన్నారు. అయితే వారి సంఖ్యాబలం కారణంగా పీటీఐకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును గౌరవించామని తెలిపారు. అందుకే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు నవాజ్ చెప్పారు.

కాంగ్రెస్ లోకి 30మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి కోమటిరెడ్డి సంచలనం

2013 నుంచి 2023 జనవరి వరకు రాష్ట్రాన్ని పాలించిన పీఎంఎల్-ఎన్ అధినేత తీవ్రస్థాయిలో నవాజ్ షరీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని పరిష్కరిస్తామని నవాజ్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనకు భరోసా ఇస్తుందని, మన్సెహ్రాకు విమానాశ్రయం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్ లు అమలు చేయనున్న ప్రభుత్వం..

ఫిబ్రవరి 8వ తేదీన ఆ దేశంల ఎన్నికలు జరగనున్నాయి. 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు గతేడాది డిసెంబర్ 15వ తేదీన పాకిస్థాన్ ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. 240 మిలియన్ల జనాభా ఉన్న ఆ దేశంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పీఎంఎల్-ఎన్, ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

click me!