చైనాలో భూకంపం సంబవించింది. ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
బీజింగ్: చైనాలోని కిర్గిజిస్తాన్-జిన్ జియాంగ్ సరిహద్దు ప్రాంతంలో 7.1 తీవ్రతతో మంగళవారం నాడు భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఇళ్లు కూలిపోయినట్టుగా చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది.
చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలోని వుషి కౌంటీ పర్వత సరిహద్దు ప్రాంతంలో 22 కి.మీ. లోతులో సంబవించిందని అధికారులు తెలిపారు. జిన్ జియాంగ్ భూకంప ఏజెన్సీ కథనం మేరకు వుషికి 50 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం నాడు ఉదయం 8 గంటల సమయంలో భూకంపం చోటు చేసుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
undefined
ఉరుంకి, కొర్లా, కష్గర్ పరిసర ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఉన్నట్టుగా చైనా విబో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో నెటిజన్లు పేర్కొన్నారు. జిన్ జియాంగ్ రైల్వే డిపార్ట్ మెంట్ వెంటనే కార్యకలాపాలను నిలిపివేసింది. భూకంపం కారణంగా 27 రైళ్లు ప్రభావితమైనట్టుగా జిన్హువా తెలిపారు.చైనా భూకంప పరిపాలన సహాయ ప్రధాన కార్యాలయం, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖతో కలిసి అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగాయి.
కాటన్ టెంట్లు, దుప్పట్లు, మడత మంచాలు, హీటింగ్ స్టవ్ లను అందించేందుకు సహాయక చర్యలను సమన్వయం చేశాయని చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో చైనాలోని జిన్ జియాంగ్ లో భారీ భూకంపాలు వాటిల్లాయి. సమీపంలోని కజకిస్తాన్ లో 6.7 తీవ్రత సంభవించిందని అత్యవసర మంత్రిత్వశాఖ నివేదించింది.
కజాఖస్తాన్ లోని అతి పెద్ద నగరమైన అల్మాటీలో ప్రజలు భూకంపంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు. చల్లటి వాతావరణంలోనే బయటే ఉన్నారు. 30 సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.