Israel Airstrikes on iran : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ పై బాంబులవర్షం

Published : Jun 13, 2025, 07:08 AM ISTUpdated : Jun 13, 2025, 08:05 AM IST
israel iran

సారాంశం

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సడెన్ ఎయిర్‌స్ట్రైక్స్ కు దిగింది... దీంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడులపై అమెరికా కూడా స్పందించింది.

Israel Airstrikes on iran : ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ లోని చాలా ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో బాంబు దాడులు జరిపిందని వార్తలు వస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని ముందే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.దీంతో ఇరాక్‌లోని కొంతమంది సిబ్బందిని తరలించేందుకు పెంటగాన్ అనుమతి ఇచ్చింది. మిడిల్ ఈస్ట్‌లోని తమ సైనిక కుటుంబాలను కూడా తరలించేందుకు పెంటగాన్ అనుమతి ఇచ్చింది. యుద్ధ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

గురువారం రాత్రి నుండి ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించింది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని తెహ్రాన్ టార్గెట్ గా భారీ పేలుళ్లకు దిగినట్లు  ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకటించింది. ఈ ఘటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి దృవీకరించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆపటానికి ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

ఇజ్రాయెల్ గత కొంతకాలంగా ఇరాన్ ను హెచ్చరిస్తూ వస్తోంది. తమకు ప్రమాదంగా మారే స్థాయిలో ఇరాన్ అణు పరీక్షలను జరుపుతోంది... ఇది ఆపకపోతే దాడి చేస్తామని ఆ దేశం తరచూ పేర్కొంది. ఇరాన్ యురేనియం ను ఆయుధ తయారీ కోసం సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజా దాడి ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

 

 ఇజ్రాయెల్ బోయింగ్ ఫైటర్ల ద్వారా అణు కేంద్రాలపై దాడులు జరిపినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో ఎవరికైనా ప్రాణహాని జరిగినా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు.

ఇజ్రాయెల్ దాడిలో అమెరికా పాత్రపై కూడా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో దీనిపై క్లారిటీ ఇచ్చారు. “ఇది ఇజ్రాయెల్ సొంత నిర్ణయం. ఈ దాడిలో అమెరికా పాల్గొనలేదు. మేము మా సైనికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తున్నాం” అని అన్నారు.

 

 

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చర్యలో పాల్గొనలేదని స్పష్టం చేసారు. అయితే ఇజ్రాయెల్‌తో సమన్వయం కొనసాగుతోందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అమెరికా ప్రత్యేక దౌత్యకారుడు స్టీవ్ విట్‌కాఫ్ ఇటీవల ఇరాన్ అధికారులతో అయిదు రౌండ్ల చర్చలు జరిపారు. ఈ చర్చల సమయంలో ఇజ్రాయెల్ చర్యకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న వైరం నేపథ్యంలో తాజా పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ ఈ దాడిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తేహరాన్ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే