మరీ ఇంత నిర్లక్ష్యమా ? రైలు నడుపుతూ సెల్ ఫోన్ వాడిన మహిళా లోకో పైలెట్.. తరువాత ఏమైందంటే ? వీడియో వైరల్

By Asianet NewsFirst Published Apr 22, 2023, 3:12 PM IST
Highlights

ఓ మహిళా లోకో పైలెట్ నిర్లక్ష్యంగా ట్రైన్ నడపుతూ భారీ ప్రమాదానికి కారణమయ్యారు. ట్రైన్ నడుపుతున్న సమయంలో ఆమె తన స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ కూర్చుకున్నారు. దీంతో ఆమె నడుపుతున్న ట్రైన్ వేగంగా మరో ట్రైన్ ను ఢీకొట్టింది. 

రైలు నడుపుతూ ఓ మహిళ తన మొబైల్ ఫోన్ ను ఉపయోగించింది. సెల్ ఫోన్ చూడటంలో ఆమె నిమగ్నవడంతో ఆ రైలు మరో రైలును ఢీకొట్టింది. దీనికి సంబంధించినవ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తుల వీడియోలను పోస్ట్ చేసే ట్విట్టర్ పేజీ ఈ ఘటనను కూడా విడుదల చేసింది. ఈ ప్రమాదం  2019 అక్టోబర్ రష్యాలో చోటు చేసుకుంది.

అతిక్ అహ్మద్ ను అమరవీరుడిగా అభివర్ణించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన

ఆ వీడియోలో ఓ మహిళా లోకో పైలెట్ రైలు నడుపుతూ తన మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తోంది. కొంత సమయం సేపు తను చేస్తున్న పనిని కూడా మర్చిపోయి ఫోన్ లోనే మునిగిపోయింది. ఆ సమయంలో రైలు వేగంగా వెళ్తూనే ఉంది. అయితే ఒక్క సారిగా ఆమె సెల్ ఫోన్ ను నుంచి తలపైకి లేపి చూసేసరికి ఎదురుగా ఓ ట్రైన్ వస్తోంది. దీంతో ఆమె ట్రైన్ కంట్రోల్ చేద్దామని సెల్ ఫోన్ ను కింద పడేసి బ్రేక్ వేయడానికి ప్రయత్నించింది. కానీ ఆలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఆమె నడుపుతున్న రైలు అదే పట్టాలపై ఉన్న వేరే రైలును ఢీకొట్టింది.

36 గంటల్లో 5300 కిలో మీటర్లు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇదే..

రైలును వేగంగా ఢీకొట్టిన ప్రభావం భారీగా ఉన్నప్పటికీ.. ఆమె సీటు బెల్టు ధరించడం వల్ల పెద్దగా గాయాలు కాలేదు. కానీ లోపల ఉన్న ఓ ప్రయాణికుడు ఆకస్మికంగా సంభవించిన ఈ ప్రమాదం వల్ల ముందుకు వెళ్లిపడ్డాడు. అతడికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. కొంత సమయం పాటు కిందపడి అలాగే ఉన్నాడు.

driving a train while on a smartphone pic.twitter.com/CZA23skxdv

— CCTV IDIOTS (@cctvidiots)

‘స్మార్ట్ ఫోన్ వాడుతూ రైలు నడపడం’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. పోస్టు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియోకు 10.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు చాలా మంది యూజర్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఆ ఫోన్ అంత స్మార్ట్ గా ఉంటే ఆమెను హెచ్చరించి ఉండేదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అంత వేగంగా రైలు నడుపుతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్ ఎందుకు వాడిందని ఓ యూజర్ ప్రశ్నించారు. లోకో పైలెట్ అలాంటి సమయంలో శ్రద్ధ వహించాల్సిందని మరో యూజర్ పేర్కొన్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేవలం రెండు స్థానాల్లోనే ఎంఐఎం పోటీ.. ఎందుకంటే ?

మరో యూజర్ సరదాగా ‘‘ కొంచెం ఆగి చూడండి..లోక్ పైలెట్ లాయర్ గా మారుతుంది. తనకు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని ఎవరూ చెప్పలేదు అని అంటారు’’ అని కామెంట్ చేశారు. ‘ఇలాంటి రైళ్లలో రాడార్ ఆధారిత బ్రేకింగ్ ఫీచర్ ఎందుకు ఉండకూడదు’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. 

click me!