Pakistan: కేజీ బియ్యం రూ. 335, కిలో మటన్ రూ. 1800.. ధరలు చూసి షాకయ్యారా? 

By Asianet NewsFirst Published Apr 21, 2023, 12:34 PM IST
Highlights

Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ లో ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలపై పెనుభారం మోపింది. రంజాన్‌ మాసంలో ధరలు మరోసారి రెట్టింపయ్యాయి. 

Pakistan: గత ఏడాది శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. భారత్ సహా పలు దేశాల సహకారంతో శ్రీలంక కొంతవరకు కోలుకుంటుంది. ఇలాంటి పరిస్థితే మరో పొరుగు దేశం ఎదుర్కొంటుంది.  అదే పాకిస్థాన్.. ఇక్కడి ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాది పాకిస్థాన్ లో సంభవించిన వరదల కారణంగా దాదాపు 1,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 20 లక్షల మంది ఇళ్లు కోల్పోయి.. రోడ్డున పడ్డారు. దీనికి తోడు..ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్ లో కొందామంటే కొరివి.. అమ్ముదామంటే.. అడవి అన్న చెందాంగా మారింది. పాక్ ప్రజలు దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ  కొత్త సంవత్సరం బ్రెడ్, పాల ఉత్పత్తులు, గోధుమలతో సహా రోజువారీ వస్తువుల ధరలు పెరిగాయి.దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశంలో ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలపై పెనుభారం మోపింది. 

పైగా ఇది రంజాన్ మాసం.. ధరలు మరోసారి రెట్టింపయ్యాయి. ఈ ధరలతో పండుగ కూడా సరిగా చేసుకోలేని పరిస్థితి. ఈద్-ఉల్-ఫితర్‌లో నెల రోజుల ఉపవాసం ముగింపును జరుపుకోవడానికి సాధారణ ఆహారాన్ని కొనుగోలు చేయడంలో సామాన్యులు నిస్సహాయంగా ఉన్నారు.  విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత కారణంగా పాకిస్తాన్ ఆర్థిక సవాళ్లతో పోరాడుతూనే ఉంది. అక్కడి పౌరులకు పిండి, నూనె , గ్యాస్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం కష్టంగా మారింది. నిత్యావసర భాగమైన ఉల్లిపాయలు ఇప్పుడు సాధారణ మనిషికి అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం బియ్యం ధర కిలో బియ్యం 335 రూపాయలు ,  మటన్ కిలో 1400 నుండి 1800 రూపాయలు పలుకుతోంది.

ఇక కిలో బియ్యం ధర రూ.50 నుంచి రూ. 335కు పెరిగింది. పండుగ సమయం కావడంతో పండ్ల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. ఆరెంజ్ ధర డజన్ రూ.440, అరటిపండు డజన్ రూ.300. దానిమ్మ కిలో రూ.440, ఇరానియన్ యాపిల్ కిలో రూ.340, జామ పండు రూ.350, స్ట్రాబెర్రీ రూ.280 వరకు చేరుకున్నాయి. ఇక రోజువారీ అవసరాలైన గ్యాస్, కరెంటు, పెట్రోల్, పిండి వంటి ధరలు అందుబాటులో లేవు. సగటు వ్యక్తి కొనుగోలు చేయడం చాలా ఖరీదైనప్పటికీ, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. దేశంలో ద్రవ్యోల్బణం 47 శాతానికి చేరుకుంది. ఈద్ వేడుకలకు కూడా ధరల పెరుగుదల అడ్డుగా వస్తోంది. 

పాకిస్తాన్ స్థానిక మీడియా ప్రకారం.. ప్రజల కొనుగోలు "రాక్-బాటమ్" చాలా తగ్గిందనే చెప్పాలి.ఇద్ (పండుగ) షాపింగ్ చేయడానికి వారిని స్థోమత లేకుండా పోయింది. ఇది మాత్రమే కాదు.. ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ ధరలను కూడా పెంచింది. పెరుగుతున్న ఆర్థిక కష్టాల మధ్య నిత్యావసరాల ధరలు, పెట్రోలు ,విద్యుత్ ఛార్జీలను తరచుగా పెంచడంతో సగటు పాకిస్థానీ జీవితం ఆగమ్యం గోచరంగా మారింది. మొత్తం మీద ద్రవ్యోల్బణ భారాన్ని భరించలేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ స్థానిక మీడియా నివేదించింది. ఈద్-ఉల్-ఫితర్ సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం , తీవ్రమవుతున్న జీవన వ్యయంతో పాకిస్తాన్ అంతటా మిలియన్ల మంది ప్రజలు కష్టపడుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఇటీవల నివేదించింది. రంజాన్ సందర్భంగా తక్కువ-ఆదాయ కుటుంబాలపై కొంత భారాన్ని తగ్గించే ప్రయత్నంలో.. ప్రాంతీయ ప్రభుత్వాలు పిండి సంచులను పంపిణీ చేసే ప్రణాళికలను ప్రకటించాయి. కానీ.. ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో అసంఘటిత పంపిణీలు తొక్కిసలాటకు దారితీశాయి. చర్సద్దాలో ఓ వ్యక్తి మృతి చెందగా, స్వాబి, కోహట్‌లో పలువురు గాయపడ్డారు.

పిండి పంపిణీ సమయంలో గోడ కూలిపోవడంతో బన్నూలో మరో వ్యక్తి మృతి చెందాడు. దక్షిణ పంజాబ్‌లోని హుస్పూర్ తహసీల్‌లో ఉచిత పిండి పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఐదుగురు మహిళలు గాయపడ్డారు. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో రంజాన్ జరుపుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల పేద ప్రజలు పండుగను సక్రమంగా జరుపుకోలేకపోతున్నారు.

click me!