Israel War Exclusive: ఏ క్షణమైనా ఇరాన్ క్షిపణి దాడులు..: ఇజ్రాయెల్ లోని ఓ భారత మహిళ ఆందోళన ఇదీ..

By Arun Kumar PFirst Published Apr 12, 2024, 9:45 PM IST
Highlights

ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడిచేసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారతీయులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ తమ పరిస్థితిని ో భారతీయ మహిళ ఏషియా నెట్ కు తెెలియజేసారు...

Iran Israel War : పలు దేశాల మధ్య యుద్ద వాతావరణం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలాకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం కొనసాగుతున్న వేళ మరో రెండు దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్దం జరగవచ్చు... ఇరుదేశాల నుండి ఈ సంకేతాలు వెలువడుతున్నాయి.  ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయవచ్చన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. భారతదేశం కూడా తమ పౌరులను ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు వెళ్లవద్దని సూచించింది.  

అయితే ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో వున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతోందని భయంభయంగా బ్రతుకుతున్నామని... ఇక యుద్దం ప్రారంభమైతే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. దీంతో రెండు దేశాల్లోని భారతీయులు, ఇక్కడున్న వారి బంధువులు కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు. గతంలో పలు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినపుడు భారతీయులను స్వదేశానికి తరలించినట్లే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ నుండి తరలించాలని కోరుతున్నారు. 

ఇరాన్ లో కంటే ఇజ్రాయెల్ లో ఎక్కువమంది భారతీయులు వున్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడిచేసే అవకాశాలున్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడి భారీతీయులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టెల్ అవీవ్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని భారతీయులే కాదు భారత రాయబార కార్యాలయం కూడా ఆందోళన చెందుతోంది.

టెల్ అవీవ్‌లో మారుతున్న పరిస్థితులు...

ఇజ్రాయెల్ లో ప్రస్తుత పరిస్థితి గురించి అక్కడ నివాసముంటున్న ఓ మహిళ ఏషియానెట్ న్యూస్ తో మాట్లాడారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా వుంది...ఏ క్షణం జరుగుతుందోనన్న భయంతో వున్నామని ఆమె తెలిపారు. కొద్దిరోజుల పాటు అంతా ప్రశాంతంగానే వుంది... కానీ ఇప్పుడు దాడులు జరగవచ్చంటూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. భారత ఎంబసీ కూడా సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా వుండాలని హెచ్చరించిందని వెల్లడించారు. 

ప్రస్తుతం టెల్ అవీన్, పేట టిక్వా ప్రాంతాలు ప్రశాంతంగానే వున్నాయని సదరు మహిళ తెలిపారు. కానీ ఇజ్రాయెల్ కు ఉత్తరాన, దక్షిణాన వున్న ప్రాంతాల్లో బాంబుల దాడులు జరుగుతున్నాయన్నారు. రాజధాని జెరూసలెంలో పరిస్థితి మరింత దారుణంగా వుందని సదరు మహిళ తెలిపారు. 

 
 

click me!