ఇజ్రాయెల్- పాలస్తినా యుద్దంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఓటింగ్ లో పాలస్తినాకు మద్దతుగా నిలిచింది.
న్యూడిల్లీ : భారత దేశం పాలస్తినా ప్రజలకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసింది. ఇజ్రాయిల్-పాలస్తినా యుద్దం నేపథ్యంలో యూఎన్ ఇతర దేశాల అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో 'పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం' అనే అంశంపై యూఎన్ మానవహక్కుల కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించింది. ఇక తూర్పు జెరూసలేంతో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో మానవ హక్కుల పరిస్థితి, జవాబుదారీతనం మరియు ప్రజలకు న్యాయం’పై తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.
ఇజ్రాయెల్, గాజా మధ్య గత ఏడాదిగా యుద్దం జరుగుతోంది. దీంతో వేలాదిమంది నిరాశ్రయులు కాగా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో జోక్యం చేసుకున్న ఐక్యరాజ్యసమితి యుద్ద పరిస్థితిని సమీక్షించింది. దీంతో యుద్దం వల్ల మానవహక్కుల పరిస్థితిపై ఓటింగ్ నిర్వహించగా ఇందులో భారత్ పాల్గోంది.
గురువారం పాలస్తినా భూభాగంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై యూఎన్ యూఎన్ ఓటింగ్ నిర్వహించింది. ఇందులో మొత్తం 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 28 దేశాలు దీనికి మద్దతుగా నిలిచారు.ఆరు దేశాలు మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఫ్రాన్స్, డొమినికన్ రిపబ్లిక్ మరియు జపాన్‌తో పాటు భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది.