సులేమానీ హత్యకు ప్రతీకారం: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి

By narsimha lode  |  First Published Jan 8, 2020, 8:01 AM IST

అమెరికాపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో  దాడులకు దిగింది



బాగ్దాద్: అమెరికాపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో  దాడులకు దిగింది. సులేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించిన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.

ఇందులో భాగంగానే అమెరికా దాని మిత్రదేశాలు పై దాడులు తప్పవని హెచ్చరించింది.పశ్చిమ దేశాలనుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది 

Latest Videos

undefined

Also read:ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట: 35 మంది మృతి

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రకమైన దాడులు యుద్దానికి దారితీస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇరాన్ సైన్యం అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడడాన్ని పెంటగాన్ అధికారులు సమీక్షించారు. ఎంత నష్టం వాటిల్లిందనే విషయమై అధికారులు ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నారు.

పశ్చిమ ఇరాక్ లో యూఎస్ నేతృత్వంలోని పశ్చిమాసియా బలగాలు 2003 నుండి ఉన్నాయి.2018లో ట్రంప్ ఈ సైనిక స్థావరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇస్లామిక్ స్టేట్ గురించి వ్యాఖ్యలు చేశారు.
 


 

click me!