టిక్ టాక్ ఆర్టిస్ట్ తో లింక్: టీవీ యాంకర్ కొట్టిన మంత్రి

Published : Jan 07, 2020, 05:55 PM IST
టిక్ టాక్ ఆర్టిస్ట్ తో లింక్: టీవీ యాంకర్ కొట్టిన మంత్రి

సారాంశం

పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి టీవీ యాంకర్ ను కొట్టాడు. తనకు టీక్ టాక్ స్టార్ తో లింక్ పెట్టినందుకు యాంకర్ ను కొట్టినట్లు ఆయన అంగీకరించారు. గతంలో కూడా ఆయన ఈ విధమైన చర్యలకు పాల్పడిన ఉదంతాలున్నాయి.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్స్, టెక్నాలజీ మంత్రి పవాద్ చౌదరి టీవీ యాంకర్ ను కొట్టారు. టిక్ టాక్ సెన్షేషన్ హరీం షాతో లింక్ పెట్టినందుకు ఆయన ఆ పనిచేశారు. టీవీ యాంకర్ ను కొట్టిన విషయాన్ని ఆయన అంగీకరించారు. 

తన చర్యను ఆయన సమర్థించుకున్నారు కూడా. అన్నింటికన్నా ముందు తాను మనిషినని ఆయన అన్నట్లు ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ రాసింది. మంత్రులు వస్తారు పోతారని, వ్యక్తిగత దాడులను తాను సహించబోనని, మనమంతా మానవ మాత్రులమని, అటువంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మనం స్పందిస్తామని ఆయన అన్నారు. 

యాంకర్ ను కొట్టిన వీడియో వైరల్ కావడంతో టీవీ యాంకర్ ముబాషిర్ లుక్మాన్ పై విరుచుకుపడ్డారు. క్యాప్షన్ పై చౌదరి మరో ట్వీట్ కూడా చేశాడు. ముబాషిర్ వంటి వ్యక్తులకు జర్నలిజంతో సంబంధం లేదని, అతని చర్యలను ఎండగట్టడం ప్రతి ఒక్కరి విధి అని ఆయన అన్నారు. 

సహచర యాంకర్ రాయ్ సఖీబ్ ఖారల్ లుక్ మ్యాన్స్ షో గురించి మాట్లాడుతూ టీక్ టాక్ షో స్టార్ తో చౌదరి కలిసి ఉన్న పలు వీడియోలు ఉన్నాయని, వారిద్దరు కలిసి ఉన్నప్పుడు తాను స్వయంగా చూశానని అన్నారు. 

టీవీ యాంకర్ తో ప్రవర్తించినట్లుగానే గతంలో చౌదరి ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. నిరుడు జూన్ లో చదౌరి టీవీ హోస్ట్ సామి ఇబ్రహీంను కూడా ఓ పెళ్లిలో కొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే