చల్లారని ఉద్రిక్తతలు: అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు

By Siva KodatiFirst Published Jan 13, 2020, 3:07 PM IST
Highlights

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తలు మళ్లీ పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరు దేశాలు సంయమనం పాటిస్తాయని అంతర్జాతీయ సమాజం భావించింది. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులకు పాల్పడింది. 

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తలు మళ్లీ పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఇరు దేశాలు సంయమనం పాటిస్తాయని అంతర్జాతీయ సమాజం భావించింది. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

Also Read:అమ్మాయే... అబ్బాయిలా వేషం మార్చి... 50మందిపై అత్యాచారం

సోమవారం తెల్లవారుజామున అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది.

ఈ ఘటనలో నలుగురు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందని.. తరచుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాక్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయని విమర్శించారు.

Also Read:ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఇరాక్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇరాక్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నిర్విరామంగా కృషి చేస్తాయని పాంపియో వెల్లడించారు.

కాగా ఇరాన్‌ దాడులు చేసిన అల్ బరాద్ ఎయిర్‌బేస్‌లో ఎఫ్ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్-అమెరికా ఉద్రికత్తల నేపథ్యంలో అల్ బరాద్ స్థావరం నుంచి అమెరికా వైమానిక దళ సభ్యులు, ఇతర సాంకేతిక సహాయ బృందాలు ఇప్పటికే వెళ్లిపోయాయి. 

click me!