ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు: సున్ని షియాల మధ్య జాతి వైరం దీనికి కారణం

By Sandra Ashok KumarFirst Published Jan 9, 2020, 12:50 PM IST
Highlights

ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.  మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. 

ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. 

ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధ మేఘాలు ఎందుకు అలుముకున్నాయి అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం. మధ్యప్రాచ్యం లో రెండు బలమైన దేశాలు మనకు కనబడుతాయి. ఒకటి ఇరాన్ కాగా రెండవది సౌదీ అరేబియా. (ఇజ్రాయెల్ కూడా అక్కడే భౌగోళికంగా ఉన్నప్పటికీ కూడా అది ముస్లిమేతర యూదు దేశం. కాబట్టి కొద్దిసేపు దాన్ని పక్కనపెడదాము.

also read ప్రతీకారం.. అమెరికా ఎంబసీ పై ఇరాన్ రాకెట్ దాడి

సౌదీ అరేబియా ముఖ్యంగా సున్ని ప్రాబల్యం ఉన్న దేశం కాగా...ఇరాన్ షియాల ప్రాబల్యమున్న దేశం. ఇది ఒకరకంగా సున్ని, షియ దేశాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధంగా చెప్పవచ్చు. ఇక్కడొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇరు దేశాలు ఇప్పటివరకు ఒకరితో మరొకరు యుద్ధానికి వెళ్లిన దాఖలాలు లేవు. కేవలం పక్కదేశాల్లోని అంతర్గత అంశాల జోలికి వెళ్లడమో లేదా వేరే ఏవైనా రెండు దేశాలు తలపడుతుంటే వారు కూడా మధ్యలో దూరి అనధికారికంగా వారికి ఆయుధాలు, డబ్బు ఇతరత్రాలను సమకూర్చడం జరుగుతుంది. 

ఇక రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఈ రెండు దేశాల మధ్య అప్పటికే కొనసాగుతున్న వైరానికి మరింత ఆద్యం పోశాయి. ఇరాన్ రష్యాకు మిత్రుడిగా మారిపోతే... సౌదీ ఏమో అమెరికాకు అత్యంత మిత్ర దేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్యప్రాచ్య ప్రాంతమంతా ఎప్పుడు కూడా నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది. 

మధ్యప్రాచ్యం లో ఉన్న ఈ దేశాలకు తోడుగా ఇజ్రాయెల్ కూడా తోడవడం వల్ల సమస్య మరింతగా జఠిలంగా మారింది. 1940 దశకంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా సౌదీ యుద్ధాలు కూడా చేసింది. వారి మధ్య పాచి గడ్డి వేస్తే భగ్గుమనేది. నేటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య అధికారికంగా సంబంధాలు మాత్రం లేవు. 

also read అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి: కీలక ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

కానీ ఈ 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనధికారిక సంబంధాలను మాత్రం ఈ రెండు దేశాలు కొనసాగిస్తున్నాయి. శత్రువు శత్రువు మిత్రుడు అన్న చందంగా ఇరాన్ ఈ రెండు దేశాలకు కూడా కామన్ శత్రువు అయినందున వారు ఇద్దరు ఇప్పుడు ఇరాన్ ని ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యారు. ఇజ్రాయెల్ కోసం పాలస్తీనాతో సంబంధాలను దాదాపుగా తెంచుకుని స్థితికి వచ్చింది సౌదీ అరేబియా.

ఇవి మధ్యప్రాచ్యం లోని రాజకీయ స్థితిగతులు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరాన్ తో ఒక అను ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ట్రంప్ 2018లో దాన్ని రద్దు చేయడం తో మొదలైన ఉద్రిక్తతలు ఈ ప్రస్తుత పరిస్థితులకు కారణమయ్యాయి. 
 

click me!