హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్

By telugu teamFirst Published Sep 22, 2019, 11:28 AM IST
Highlights

ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్ట అనే జబ్బుతో బాధపడుతూ కదల్లేని పరిస్థితుల్లో చక్రాల కుర్చీకే పరిమితమైనా, తన వైకల్యాన్ని ఎదురించి రాక్ మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. 

హ్యూస్టన్: భారత సంతతికి చెందిన 16 ఏళ్ల స్పర్శ్ షా ఈ హౌడీ మోడీ ఈవెంట్ లో భారత జాతీయ గీతం జనగణమన ను ఆలపించనున్నాడు. ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్ట అనే జబ్బుతో బాధపడుతూ కదల్లేని పరిస్థితుల్లో చక్రాల కుర్చీకే పరిమితమైనా, తన వైకల్యాన్ని ఎదురించి రాక్ మ్యూజిక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. 

ఈ వ్యాధి వల్ల ఎముకలు చాల పలుచబడి, తేలికగా విరిగిపోతుంటాయి. అందుకే ఈ వ్యాధిని బ్రిటిల్ బోన్ డిసీస్ అని కూడా అంటూంటారు. ఇప్పటివరకు 130 పైచిలుకు ఎముకలు విరిగినా ఏ మాత్రం తన స్థైర్యాన్ని కోల్పోకుండా తన జీవిత పయనాన్ని సాగిస్తున్నాడు స్పర్శ్ షా. 

జాతీయ గీతం ఆలపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలవబోతున్నానన్న ఆనందంలో స్పర్శ్ షా ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. గత పర్యాయం మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో మోడీని కలిసే ఛాన్స్ లభించలేదని, అప్పుడు కేవలం టీవిలో మాత్రమే చూశానని చెప్పాడు. ఈ సారి తన కల నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

అమెరికన్ పాప్ సింగర్ ఎమినెమ్ పాడిన నాట్ అఫ్రెయిడ్ పాటను తిరిగి స్పర్శ్ పాడాడు. ఇది ఎంతలా పాపులర్ అయ్యిందంటే, తిరిగి ఎమినెమ్ రీట్వీట్ చేసేంత. ఒక సంగీతకారుడిగా, గాయకుడిగానే కాకుండా, ఎందరో జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపాడు ఈ కుర్రాడు. మోటివేషనల్ స్పీకర్ గా కూడా స్పర్శ్ షా సుప్రసిద్ధుడు.

 

మీరు చాల నష్టపోయారు, కలిసి నూతన కాశ్మీరును నిర్మిద్దాం: కాశ్మీరీ పండిట్లతో మోడీ

హౌడీ మోడీ ఈవెంట్ కు హ్యూస్టన్ ను వేదికగా ఎంచుకోవడానికి కారణాలు ఇవే...

మోడీ అమెరికా పర్యటన సాగనుంది ఇలా...

హౌడీ మోడీ ఈవెంట్ లో జనగణమన పాడనున్న భారత స్పెషల్ కిడ్

అమెరికాలో మోడీకి బ్రహ్మరథం: హౌడీ హ్యూస్టన్ అంటూ మోడీ పలకరింపు

 

click me!