కాదేది మాంద్యానికి అనర్హం: ఆ దేశంలో కండోమ్లు  కొనడానికి బెదురుతున్న ప్రజలు

By telugu teamFirst Published Sep 21, 2019, 4:28 PM IST
Highlights

మాంద్యం దెబ్బకు కండోమ్ల అమ్మకాలు 8శాతం మేర పడిపోయాయని అర్జెంటీనా వ్యాపారవర్గాలు గగ్గోలుపెడుతున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6శాతం పడిపోయాయట. దీనికి కారణం ఆర్ధిక మాంద్యమేనని వారు వాపోతున్నారు. 

ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కావేవీ కవితకు అనర్హం అన్నాడొక మహాకవి. కానీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాత్రం కావేవీ మాంద్యానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. నిత్యావసరాల నుంచి మొదలుకొని కండోమ్ల వరకు ఆర్ధిక మాంద్యం దేన్నీ వదలడం లేదు. 

మాంద్యం దెబ్బకు కండోమ్ల అమ్మకాలు 8శాతం మేర పడిపోయాయని అర్జెంటీనా వ్యాపారవర్గాలు గగ్గోలుపెడుతున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6శాతం పడిపోయాయట. దీనికి కారణం ఆర్ధిక మాంద్యమేనని వారు వాపోతున్నారు. 

డాలర్ తో పోలిస్తే ఆర్జెంటినా కరెన్సీ పేసో, రోజు రోజుకూ పడిపోతూ కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనితో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. వారివద్ద డబ్బులు లేక కనీసం కండోమ్లు కొనడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. 

ప్రస్తుత ఆర్జెంటినా ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ అక్కడ సుప్రసిద్ధ నటుడు, గిల్లెర్మో సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసాడు. అది కేవలం కొద్దీ గంటల్లోనే వైరల్ అయ్యింది. ఆ వీడియోలో తాను తన భార్యను సుఖపెట్టలేకపోతున్నానని చెప్పాడు. తనవద్ద ఇంకా కేవలం ఒక్క కండోమ్ మాత్రమే మిగిలి ఉందని, అది అయిపోతే వేరేవి కొనేందుకు డబ్బులు లేవని చెప్పాడు. దీనికి కారణం ప్రస్తుత ఆర్ధిక పరిస్థితని వాపోయాడు. 

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలా రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే సుఖవ్యాధులతో పాటు ఎయిడ్స్ కూడా ప్రబలే ప్రమాదముందని వారు ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. 

 

click me!