దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ

Published : Oct 27, 2026, 10:33 AM IST
Indian in Dubai wins morethan Rs 12 crore lottery prize for Rs 1300 lottery ticket

సారాంశం

యూఏఈలో 33 ఏళ్లుగా ఉంటున్న భారతీయుడు కిషోర్ పాండురంగ రావుకు అదృష్టం వరించింది. కేవలం 50 దిర్హామ్స్ అంటే రూ.1300 పెట్టి కొన్న టికెట్‌తో ఏకంగా సుమారు రూ.12.9 కోట్లు లాటరీ గెలుచుకున్నారు. ఈ డబ్బుతో ఆయన ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్పారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మూడు దశాబ్దాలకు పైగా ఉంటున్న భారత సంతతికి చెందిన కిషోర్ పాండురంగ రావుకు భారీ అదృష్టం దక్కింది. యూఏఈ లాటరీలో ఆయన ఏకంగా 50 లక్షల దిర్హామ్స్ (సుమారు రూ.12.9 కోట్లు) గెలుచుకున్నారు. ఇప్పుడు తన ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, భార్యతో కలిసి వరల్డ్ టూర్ వెళ్లడం, గోల్డెన్ వీసా తెచ్చుకోవడం లాంటి కలలను నిజం చేసుకునే పనిలో పడ్డారు.

రూ.1,300 పెట్టుబడికి రూ.12.9 కోట్ల బహుమతి!

షార్జాలో ఉంటున్న కిషోర్ రావు అక్టోబర్ 3న జరిగిన 'లక్కీ డే' లాటరీ డ్రాలో సెకండ్ ప్రైజ్ కొట్టేశారు. ఆయన కేవలం 50 దిర్హామ్స్ (సుమారు రూ.1,300) పెట్టి ఈ లాటరీ టికెట్ కొన్నారు. నంబర్లను సెలెక్ట్ చేసుకోవడానికి 'ఈజీ పిక్' ఆప్షన్ వాడారు. డ్రాలో 'డేస్' కేటగిరీకి చెందిన ఆరు నంబర్లు మ్యాచ్ అవ్వడంతో ఆయనకు 50 లక్షల దిర్హామ్స్ బహుమతి దక్కింది. అక్టోబర్ 8న తన 60వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందే ఆయనకు ఈ గుడ్ న్యూస్ తెలిసింది.

డబ్బు కంటే ఫ్యామిలీకే ఫస్ట్ ప్రిఫరెన్స్

కిషోర్ రావుకు ఈ డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం కంటే ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం వాడటమే ముఖ్యం. తన పెద్ద కొడుకు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి సాయం చేయాలని, చిన్న కొడుకు హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సపోర్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. పని ఒత్తిడి వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉన్న రోజులు చాలా ఉన్నాయని, అందుకే ఇకపై అందరూ యూఏఈలో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు.

గోల్డెన్ వీసా, భార్యతో వరల్డ్ టూర్

1993లో యూఏఈకి వచ్చిన కిషోర్ రావు.. దుబాయ్, అజ్మాన్, షార్జా, అబుదాబి లాంటి చోట్ల ఉన్నారు. ఎప్పటినుంచో యూఏఈ గోల్డెన్ వీసా పొందాలనే కోరిక ఆయనకు ఉంది. ఇప్పుడు ఆ వీసాకు అప్లై చేసుకునే ఛాన్స్ దొరికింది. అలాగే, ట్రావెలింగ్ అంటే ఇష్టపడే తన భార్యతో కలిసి ప్రపంచంలోని వివిధ దేశాలు చుట్టిరావాలనేది ఆయన డ్రీమ్. అయితే, ఈ డబ్బును ఎలా వాడాలనే దానిపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయన చెప్పారు. లాటరీలో పార్టిసిపేట్ చేసేవాళ్లు తమ ఖర్చులకు ఒక లిమిట్ పెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Paris Protests: పారిస్ నగరం ఎందుకు తగలబడుతోంది? యువకులు ఎందుకు రోడ్లెక్కారు?