యూఎస్ ఫస్ట్ లేడీ టీంలో భారతీయురాలు !

By AN TeluguFirst Published Jan 15, 2021, 2:13 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం దగ్గరపడుతున్న కొద్దీ టీమ్ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో  జో బైడెన్ భార్య, కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక పదవి దక్కింది. భారత సంతతి గరిమా వర్మను జిల్ డిజిటల్ డైరెక్టర్‌గా నియమించినట్లు బైడెన్ ట్రాన్సిషన్ టీం గురువారం వెల్లడించింది. 

అలాగే ఫస్ట్ లేడీ కార్యాలయానికి సంబంధించిన ఇతర కొన్ని నియామకాలు కూడా జరిగాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రోరే బ్రోసియస్, ప్రెస్ సెక్రటరీగా మైఖేల్ లారోసా నియమితులయ్యారు. కాగా, ఇండియాలో పుట్టిన గరిమా వర్మ ఒహియో, సెంట్రల్ వ్యాలీ ఆఫ్ కాలిఫోర్నియాలో పెరిగారు. 

ఇంతకుముందు ఆమె బిడెన్-హారిస్ ఎన్నికల ప్రచారంలో కంటెంట్ వ్యూహకర్తగా పనిచేశారు. అలాగే ఫిల్మ్ మార్కెటింగ్‌లో కూడా వర్మకు ప్రవేశం ఉంది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన ఏబీసీ నెట్‌వర్క్‌ టెలివిజన్‌లో పని చేశారు. ఇక ఇప్పటికే బైడెన్, జిల్ టీమ్స్‌లో పలువురు భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు దక్కిన విషయం తెలిసిందే. 

click me!