ఆప్ఘనిస్తాన్ లో కారు బాంబు కలకలం.. ఒకరి మృతి

Published : Jan 15, 2021, 01:48 PM ISTUpdated : Jan 15, 2021, 01:57 PM IST
ఆప్ఘనిస్తాన్ లో కారు బాంబు కలకలం.. ఒకరి మృతి

సారాంశం

కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు.  


ఆప్ఘనిస్తాన్ దేశంలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఘజ్నీ ప్రావిన్సులో శుక్రవారం ఉదయం జరిగిన కారు బాంబు పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు.

 గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని నెలలుగా అప్ఘనిస్థాన్‌ దేశంలో పలు పేలుడు ఘటనలు జరిగాయి. అప్ఘనిస్థాన్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు.ఈ పేలుడుకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తేలలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..