రాత్రికి రాత్రే చేప‌లుప‌ట్టే వ్య‌క్తిని కోటీశ్వరుడిని చేసిన చేప.. దీని ప్రత్యేకత ఎంటో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Nov 11, 2023, 10:42 PM IST
Highlights

sowa fish: ప్రపంచంలో 28,000 జాతులకు పైగా చేపలు ఉన్నాయి. సముద్రంలో నివసించే కొన్ని చేపలు చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని చేపలు కోట్ల రూపాయల విలువైనవి. అందులో ఒక‌టి సోవా చేప (ఆర్గిరోసోమస్ రెజియస్) అత్యంత అరుదైన‌ది.. కోట్ల రూపాయ‌ల విలువచేసేది. ఎందుకంటే ఇది విశిష్ట‌మైన‌ వైద్య, ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది.

Pakistani fisherman becomes millionaire: అదృష్టం త‌లుపు త‌ట్ట‌డంతో చేప‌లు ప‌ట్టే వ్య‌క్తి రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు. ఇందుకు కార‌ణం ఒక చేప‌. అత‌ను ప‌ట్టిన చేప ల‌క్ష్మీదేవిలా ఆవ‌హించి అత‌న్ని జీవితాన్ని మార్చివేసింది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకెళ్తే.. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఔషధ గుణాలున్న అరుదైన చేపలు వలలో పడ్డాయి. ఆ చేపలను వేలం వేయ‌గా కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయాయి. దీంతో ఆ మ‌త్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

ఆ చేప‌లు ప‌ట్టిన వ్య‌క్తి ఇబ్రహీం హైద్రీ గ్రామానికి చెందిన హాజీ బలోచ్, అతని బృందం సోమవారం అరేబియా సముద్రం నుండి స్థానికంగా 'గోల్డెన్ ఫిష్' లేదా "సోవాష‌" అని పిలిచే చేప‌లు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కరాచీ ఓడరేవులో జరిగిన వేలంలో సుమారు రూ.7 కోట్లకు మత్స్యకారులు చేపలను విక్రయించారని ‘పాకిస్థాన్ ఫిషర్మెన్ ఫోక్ ఫోరమ్’కు చెందిన ముబారక్ ఖాన్ తెలిపారు.

సముద్రంలో నివసించే కొన్ని చేపలు చాలా ప్రమాదకరమైనవి, మరికొన్ని చేపలు కోట్ల రూపాయల విలువైనవి. అందులో ఒక‌టి సోవా చేప (ఆర్గిరోసోమస్ రెజియస్) అత్యంత అరుదైన‌ది.. కోట్ల రూపాయ‌ల విలువచేసేది. ఎందుకంటే ఇది విశిష్ట‌మైన‌ వైద్య, ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ చేప కడుపు నుండి వచ్చే పదార్థాలు అద్భుతమైన వైద్యం, ఔషధ గుణాల‌ను కలిగి ఉంటాయి. చేపల నుండి లభించే దారం లాంటి పదార్థాన్ని శస్త్రచికిత్సా విధానాలలో కూడా ఉపయోగిస్తారు. సాధార‌ణంగా 20 నుండి 40 కిలోల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉండే ఈ చేపకు తూర్పు ఆసియా దేశాలలో చాలా డిమాండ్ ఉంది.

మరీ ముఖ్యంగా, 'సోవా' చేప సాంప్రదాయ ఔషధాలు- స్థానిక వంటకాలలో ఉపయోగించడంతో దానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. సాంస్కృతిక-సాంప్రదాయిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటుంది. "మేము కరాచీకి దూరంగా ఉన్న సముద్రంలో చేపలు పట్టడం.. మాకు గోల్డ్ ఫిష్ దొరికినప్పుడు అది మాకు ఊహించని విష‌యంగా అనిపించింది" అని బలోచ్ చెప్పారు. సంతానోత్పత్తి సమయంలో మాత్రమే ఈ చేపలు తీరానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ సోవా చేప‌ల విక్ర‌యంతో వ‌చ్చిన ఈ డ‌బ్బును త‌మ ఏడుగురు స‌భ్యుల‌ బృందంతో క‌లిసి పంచుకుంటామ‌ని చెప్పారు.

click me!