AI లో ఎలాన్ మస్క్ కే సవాల్ విసురుతున్న ఐఐటియన్ ... అతడి గట్స్ కి ప్రపంచమే ఫిదా

Published : Feb 28, 2025, 10:48 PM IST
AI లో ఎలాన్ మస్క్ కే సవాల్ విసురుతున్న  ఐఐటియన్ ... అతడి గట్స్ కి ప్రపంచమే ఫిదా

సారాంశం

Perplexity AI సీఈఓ, ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్, ఎలన్ మస్క్‌కు సవాల్ విసిరారు. అతడి గట్స్ కి యావత్ ప్రపంచమే ఫిదా అవుతోంది. ఇంతకూ అతడు ఏమన్నాడో తెలుసా?

Aravind Srinivas : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) కే ఛాలెంజ్ విసిరిన భారతీయ ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. గూగుల్, OpenAI లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు Perplexity AI ని స్థాపించారు. ఇటీవల అతడు చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 

. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నుంచి ఫండింగ్ తెచ్చుకోకుండా నన్ను ఆపు అని ఏకంగా ఎలాన్ మస్క్‌కు సవాల్ విసిరాడు అరవింద్ శ్రీనివాస్. ఆ తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai)తో కలిసి ఉన్న అతడి ఫోటో వైరల్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన  అతడి ఫోటోలు వైరల్ గా మారాయి.

మద్రాస్ ఐఐటిలో చదివిన శ్రీనివాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ కంటే Perplexity AIపై ఎక్కువ టైమ్ స్పెండ్ చేశానని చెప్పిన ఓ సోషల్ మీడియా యూజర్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో మళ్లీ న్యూస్ లోకి వచ్చాడు.

అరవింద్ శ్రీనివాస్ ఎందుకు హాట్ టాపిక్ అయ్యారంటే? 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (Twitter)లో ఓ యూజర్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ 50 నిమిషాలు గడిపాను కానీ Perplexity AIలో 1 గంట 43 నిమిషాలు గడిపానని చెప్పాడు. ఇలాంటి మార్పు ఎలా అనిపించిందని శ్రీనివాస్‌ను అడిగాడు. దీనికి రిప్లై ఇస్తూ మెటా ప్లాట్‌ఫామ్‌పై సెటైర్ వేశాడు శ్రీనివాసన్. 'ప్రజలు ఇన్‌స్టాగ్రామ్ కంటే Perplexityపై ఎక్కువ టైమ్ గడపడం ప్రపంచానికి మంచిది' అని అన్నాడు.

 అరవింద్ శ్రీనివాస్ ఎవరు? Perplexity AIతో సంబంధం ఏంటి? 

అరవింద్ శ్రీనివాస్ Perplexity AIకి కో-ఫౌండర్, సీఈఓ. ఆయన ఇండియన్ ఇంజినీర్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆయన AI బేస్డ్ సెర్చ్ ఇంజిన్‌కు జెఫ్ బెజోస్‌తో పాటు చాలామంది ఇన్వెస్టర్ల సపోర్ట్ ఉంది. శ్రీనివాస్ 2022లో ఆండీ కోన్‌విన్స్కీ, డెనిస్ యారాట్స్, జానీ హోతో కలిసి Perplexity AIని స్టార్ట్ చేశారు. ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ చేశారు. 2017లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డబుల్ డిగ్రీ కంప్లీట్ చేశారు.

అరవింద్ శ్రీనివాస్ కెరీర్ 

శ్రీనివాస్ 2018లో OpenAIలో రీసెర్చ్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 2020-21లో గూగుల్ (Google), DeepMind లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. Perplexity AI స్టార్ట్ చేయడానికి ముందు రీసెర్చ్ సైంటిస్ట్‌గా OpenAIలో మళ్లీ వర్క్ చేశారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !