బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై మెరుపుదాడి... కాల్పుల్లో ఒకరు మృతి 

Published : Feb 24, 2025, 02:47 PM ISTUpdated : Feb 24, 2025, 03:06 PM IST
బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై మెరుపుదాడి... కాల్పుల్లో ఒకరు మృతి 

సారాంశం

బంగ్లాదేశంలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. దేశ వైమానికదళ స్థావరంపై  మెరుపుదాడికి దిగారు దుండగులు. 

Bangladesh : మన పొరుగుదేశం బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే... ఈ సమయంలో జరిగిన అల్లర్లను మరిచిపోకముందే మరిన్ని ఘటనలు చోటుచచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని కోక్స్ బజార్ లోని ఆ దేశ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. అయితే దుండగుల కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. 

కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తి కోక్స్ బజార్ ప్రాంతానికి చెందిన షేక్ కబీర్ గా గుర్తించారు. అతడి వయసు 30 ఏళ్లు ఉంటుందని  బంగ్లాదేశ్ ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది బంగ్లా ఆర్మీ. దుండగులను మట్టుపెట్టేందుకు కాల్పులు చేపట్టారు.  

ఈ ఘటనలో ఒకరు మృతిచెందడమే మరికొందరు కూడా బుల్లెట్ గాయాలకు గురయ్యారని బంగ్లాదేశ్ ఆర్మీ చెబుతోంది. కానీ ఎంతమంది గాయపడ్డారో క్లారిటీ లేదు. ప్రస్తుతం తుపాకీ శబ్దాలతో కోక్స్ బజార్ లోని ఆర్మీ స్థావరం దద్దరిల్లుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు