నటిగా తన అభద్రతలను వెల్లడించి హాలీవుడ్ ఫేమ్ గాల్ గడోట్.. ‘నాకు ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నది’

By Asianet NewsFirst Published Jun 2, 2023, 5:14 PM IST
Highlights

హాలీవుడ్ నటి గాల్ గడోట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నదని తెలిపింది. తన పనిని ఇతరులు ఇష్టపడరనే భావన తనలో ఉండేదని చెప్పింది. అయితే, దీన్ని అధిగమించడానికి డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలా సలహా పనికి వచ్చిందని వివరించింది.
 

న్యూఢిల్లీ: ప్రముఖ హాలీవుడ్ నటి గాల్ గడోట్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. నటిగా తనకు ఉన్న అభద్రతాభావాలను తెలిపింది. తనకు తనపైనే అనుమానాలు ఎక్కువ అని వివరించింది. తను చేసే పనులు, తన నటనను ఎవరూ ఇష్టపడరేలమో అనే అనుమానాలు కలుగుతాయని పేర్కొంది.

‘ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతురాలినని అనుకుంటాను. నాకు ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్నదని అనుకుంటున్నాను. నేను చేసే పని అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను చేసే పని (నా నటన!)ని వారు ఇష్టపడాలని ఆశిస్తూ ఉంటాను. అంతేకానీ, వారు కచ్చితంగా దీన్ని ఇష్టపడతారని, ప్రేమిస్తారని అనుకున్న సందర్భాలు ఒక్కటీ లేవు’ అని ఆమె ఎల్ అఫీషియల్ మ్యాగజీన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు ఏస్‌షోబిజ్ డాట్ కామ్ రిపోర్ట్ చేసింది.

38 ఏళ్ల ఈ నటి తనకు ఉపకరించిన ఓ సలహానూ పంచుకుంది. తాము అంత యోగ్యులం కాదని, తమను తాము ఫ్రాడ్‌గా అనుకునే ఓ సైకలాజికల్ డిజార్డర్ తనకు ఉండేదని, దాన్ని ఆ సలహాతో అధిగమించానని వివరించింది.

హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాతో తన సంభాషణను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. 84 ఏళ్ల ఫ్రాన్సిస్ తనతో ఇలా మాట్లాడాడని చెప్పింది. ‘నీకో విషయం తెలుసా? నాలో ఎప్పుడూ అనుమానాలే ఉండేవి. ఇదంతా వారికి నచ్చనే నచ్చదు అనే ఆలోచనలే ఎల్లప్పుడూ నన్ను చుట్టుముట్టేవి. కానీ, నేను నా మనసును అనుసరించాను. మంచి ఫలితాలు సాధించాను’ అని ఫ్రాన్సిస్ తనకు చెప్పాడని వివరించింది.

Also Read: జమ్ము కశ్మీర్‌లో సూఫీ దర్గాల అభివృద్ధి.. సూఫీ సర్క్యూట్‌తో ఆధ్యాత్మిక యాత్రలకు ప్రభుత్వ ప్రణాళిక

తన భర్త హార్ట్ ఆఫ్ స్టోన్‌తో పని చేయడం గురించీ ఆమె పంచుకున్నారు. జరోన్ వర్సనోది బిజినెస్ మైండ్ అని చెప్పింది. తనను తన భర్త కన్నా ఇంకెవరు బాగా చూసుకోగలరు? అని వివరించింది. రాబోతున్న స్నో వైట్ మూవీలో తాను ఈవిల్ క్వీన్ పాత్ర పోషిస్తున్నారని, ఈ పాత్ర గురించి తాను ఎంతో ఆతృతగా ఉన్నట్టు తెలిపింది.

ఇది నిజంగా గొప్ప మార్పు అని చెప్పింది. డిస్నీ చరిత్రలోనే తొలి ఈవిల్ క్వీన్ పాత్ర ఇది అని వివరించింది.

click me!