ఆరో అంతస్తు నుంచి కింద పడిన పిల్లి.. !

Published : Jun 01, 2023, 12:08 PM IST
 ఆరో అంతస్తు నుంచి కింద పడిన పిల్లి.. !

సారాంశం

అది ఆరో అంతస్తు నుంచి జారి పార్కింగ్ లో ఉన్న ఓ కారు మీద పడింది. దీంతో... కారు అద్దం పగిలి, పిల్లి లోపల పడింది. దీంతో పిల్లికి ఏమీ కాలేదు కానీ కారు డ్యామేజ్ అయ్యింది

పెంపుడు జంతువులను చాలా మంది తమ ఇంట్లో పిల్లలతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏదైనా జరిగితే వారు అస్సలు తట్టుకోలేరు. ఓ మహిళ కూడ తన పిల్లి ని చాలా అపురూపంగా పెంచుకుంది. కానీ అనుకోకుండా ఆ పిల్లి ఆరో అంతస్తు నుంచి జారి కింద పడింది. కానీ దానికి ఏమీ కాలేదు. అది ఆరో అంతస్తు నుంచి జారి పార్కింగ్ లో ఉన్న ఓ కారు మీద పడింది. దీంతో... కారు అద్దం పగిలి, పిల్లి లోపల పడింది. దీంతో పిల్లికి ఏమీ కాలేదు కానీ కారు డ్యామేజ్ అయ్యింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ విషయాన్ని కారు యజమాని సోషల మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. తన మేనేజర్ తనకు ఫోన్ చేసి కారు మీద పిల్లి పడిందని చెప్పాడని కారు యజమాని చెప్పారు. అయితే, పిల్లి బరువు 8.5 కేజీలు మాత్రమే ఉండటంతో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. కానీ కారు అద్దం మాత్రం పగిలింది అని అతను చెప్పడం విశేషం.


ఆ పిల్లి ఇంటి బాల్కనీ గోడపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లికి కొద్దిగా గాయాలు అయ్యాయని, కానీ ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు. తన కారుకు డ్యామేజ్ అయినప్పటికీ, అది కావాలని చేసిన డ్యామేజ్ కాకపోవడంతో తనకు కోపం రాలేదని చెప్పడం విశేషం. నిజానికి ఆ అపార్ట్మెంట్ లో  పెంపుడు జంతువులను అనుమతి లేదట. కానీ ఓ కుటుంబం ఎవరికీ తెలికుండా ఆ పిల్లిని పెంచుకుంటోంది. ఇప్పుడు ఈ ఘటనతో పిల్లి విషయం బయటపడింది. దీంతో, ఆ కుటుంబానికి ఆ ఇంటి యజమాని జరిమానా విధించడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

USA Iran: అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్‌.. 9/11 తరహా దాడులు చేస్తామంటూ హెచ్చ‌రిక
USA Iran: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే